సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చిరంజీవి సినిమాని వదులుకున్న హీరోయిన్..!!

ఏ ఇండస్ట్రీలో నైనా ఎక్కువగా.. ఏదైనా సినిమా అవకాశాన్ని వదులుకున్నారనే చాలామంది హీరోల గురించి మనం వినే ఉంటాము.. కానీ వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకున్న హీరోయిన్ల గురించి పెద్దగా విని ఉండము.. అయితే ఇప్పుడు ఆ లిస్టులోకి అలనాటి హీరోయిన్ చేరిపోయింది సదా. తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది ఇప్పుడిప్పుడే.. అయినప్పటికీ ఈమె బుల్లితెరపై ప్రోగ్రాములలో కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే సదా మెగాస్టార్ చిరంజీవి సినిమాలు నటించే అవకాశాన్ని వదులుకున్నట్లుగా తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.

Actress Sadha Reveals Why She Didn't Get Married! | Astro Ulagam

హీరోయిన్ సదా మొదటి నటించిన చిత్రం జయం. ఈ చిత్రంతోనే ఈమె మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికి సదా ఆ సినిమాలోని చెప్పిన డైలాగులు సైతం అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటాయి.. ఇక తర్వాత అపరిచితుడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత తను ఎంచుకొనే కథలు సరిగ్గా లేకపోవడం వల్ల ఆమె కెరియర్ అర్ధాంతరంగా ఆగిపోయిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి మరొకసారి తన హవా కొనసాగించాలని చూస్తోంది సదా. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా రాణించాలని చాలా ఆత్రుతతో ఉంది ఈ ముద్దుగుమ్మ.

Bhola Shankar first look: Chiranjeevi impresses us with his rugged look and  swag in latest avatar | PINKVILLA
అయితే ఈ క్రమంలోనే చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా లో హీరోయిన్ గా తమన్నా ఎంపిక అవ్వడం జరిగింది.. అసలు విషయంలోకి వెళ్తే..భోళా శంకర్ సినిమాలో సదా ఒక చిన్న పాత్ర కోసం సంప్రదించారట. ఐటెం సాంగ్ లో నటించిన తర్వాత ఒక పది నిమిషాల పాటు కామెడీ క్యారెక్టర్ కు ఆఫర్ చేయగా.. సదా మెగాస్టార్ సినిమా అయినప్పటికీ తను ఐటెం సాంగ్లో నటించడానికి ఇష్టపడలేదట అందుచేతనే ఆ సినిమాని వదులుకున్నట్లుగా సమాచారం. అయితే ఈ ఆఫర్ శ్రీముఖికి వెళ్లినట్లు సమాచారం.

Share post:

Latest