బిడ్డను ఎత్తుకుని అలా చూపించడం అవసరమా..

హీరోయిన్ ప్రణీత గురించి ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు.. ఒకప్పుడు సినిమాల్లో అడపాదడపా ప్రాలు పోషిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అయితే ప్రణీత కెరీర్ లో ఒక్క పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా ఏదీ లేదు.. ప్రణీత అందానికి కుర్రాళ్లు ఫిదా అయిపోతారు. అచ్చం బాపు బొమ్మ అన్నట్లుగా తెలుగు ప్రేక్షకులు పిలుచుకునేలా ఉంటారు.. అయితే ప్రణీతకు మాత్రం సరైన అవకాశాలు రాలేదు. కానీ కన్నడ, తమిళ ఇండస్ట్రీల్లో మాత్రం ప్రణీతకు మంచి ఈమేజ్ ఏర్పడింది.. ప్రణీత కూడా ఎక్కువగా కన్నడ సినిమాలను చేసేందుకు ఇష్టపడుతుంది. అయితే ప్రణీతకు ఎక్కువగా పేరు వచ్చింది మాత్రం తెలుగులోనే.. అందుకే ఇక్కడ కూడా సినిమాలు చేస్తుంటుంది. అయితే ప్రస్తుతం ప్రణీత వెండితెరపై కనిపించడం లేదు.

గతేడాది అక్టోబర్ లో వ్యాపారవేత్త నితిన్ రాజ్ ని పెళ్లి చేసుకున్న ప్రణీత.. ఇటీవల తల్లి అయ్యారు. ఓ అమ్మాయికి జన్మనిచ్చారు. దీంతో అందరూ ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలిపారు.. ప్రణీత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే.. ప్రస్తుతం పాప గురించి రోజూ ఏదో ఒక పోస్ట్ పెడుతుంది. అయితే ఇటీవల ఆమె ట్రోల్స్ కి గురయ్యారు. తల్లి అయ్యాక చాలా పద్ధతిగా ఉండాలి.. బిడ్డను ఎత్తుకున్నప్పుడు మరింత హుందాగా వ్యవహరించాలి.

కానీ ప్రణీత మాత్రం అలా వ్యవహరించలేదు.. తాజాగా ఆమె తన బిడ్డను ఎత్తుకొని ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆ ఫొటోలపై మాత్రం ప్రణీతను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆ ఫొటోల్లో ప్రణీత స్కిన్ షో చేస్తూ కనిపిస్తుంది. బిడ్డను ఎత్తుకున్న సమయంలో షర్టు జార్చి మరీ అలా స్కిన్ చూపించాల్సిన అవసరం ఏంటని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఒక కొందరు మాత్రం ప్రణీతను సమర్థిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ప్రతి విషయాన్ని విమర్శిస్తుంటారని, ఆ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రణీతను సమర్థిస్తున్నారు. మరీ వీటిపై ప్రణీత ఎలా స్పందిస్తారో చూడాలి.

Share post:

Latest