శ్రీకాంత్ అలా చేస్తాడనుకోలేదంటున్న హీరోయిన్ మాళవిక..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒక స్టార్ హీరోగా లవర్ బాయ్ గా, ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా అలరించాడు శ్రీకాంత్. ఆయన తీసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పలు విజయాలను అందుకున్నాయి. అలాంటి శ్రీకాంత్, హీరో నవీన్ కలిసి ఈవివి సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చిన సినిమా చాలా బాగుంది. ఈ చిత్రం 2000 వ సంవత్సరంలో విడుదలై ప్రేక్షకులకు ఈ నటులిద్దరిని బాగా దగ్గర చేసింది. ఈ సినిమా ద్వారా కన్నడ హీరోయిన్ మాళవిక పరిచయమయ్యింది.ఇందులో ఈమె నెగిటివ్ సేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు.

Actress Malavika: The hero left the middle of the shooting for saying so ..  Malavika who made shocking comments .. | Senior actress malavika intresting  comments about srikanth and chala bagundi movie - filmyzoo - Hindisip

అయితే ఈ ముద్దుగుమ్మ ఈ చిత్రంలో నటించడమే ఈమె చేసిన తప్పుగా మారిపోయింది. ఇక ఆ తరువాత తెలుగులో పలు సినిమాలలో నటించింది. చంద్రముఖి అప్పారావు డ్రైవింగ్ స్కూల్ తదితర సినిమాలలో కూడా నటించింది ఈ ముద్దు గుమ్మ.. ప్రస్తుతం మళ్ళీ తిరిగి రీఎంట్రీ ఇవ్వడానికి కూడా సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాళవిక పలు ఆసక్తికరమైన విషయాలను సైతం వెల్లడించింది. చాలా బాగుంది సినిమా షూటింగ్ సమయం లో ఒక రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ జరుగుతున్నప్పుడు తను చాలా ఇబ్బంది పడ్డాను అని తెలియజేసింది.


షూటింగ్ జరుగుతున్నప్పుడు తనకి కంఫర్ట్ లేదని శ్రీకాంత్ వెంటనే ఆ షూటింగ్ మధ్యలో వెళ్లిపోయారని తెలియజేసింది. అంతేకాకుండా ఆ చిత్రంలోనే ఒక అత్యాచారం సన్నివేశంలో కూడా తను నటించి చాలా డిస్టర్బ్ అయ్యానని కూడా తెలియజేసింది. ఆ తరువాత తనకి ఇతర భాషలలో అవకాశాలు వచ్చిన ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేసేటువంటి సినిమాలలోనే నటించడానికి అవకాశాలు వచ్చాయట. దీంతో ఆమె తల్లిదండ్రులు తనని ఇలాంటి సినిమాలలో నటించవద్దని కోప్పడడంతో ఇక సినిమాలకు దూరంగా ఉన్నదట. దాంతో మాళవిక కెరియర్ పూర్తిగా డౌన్ అయిందని చెప్పవచ్చు.

Share post:

Latest