ఈ దెబ్బతో హీరో కిరణ్ కెరియర్ పతనమైనట్టేనా..?

తెలుగులో అతి తక్కువ సమయంలోనే నటించి నటుడుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు నటుడు కిరణ్ అబ్బవరం. మొదట రాజావారు రాణివారు అనే సినిమా ద్వారా తన కెరీర్ ని మొదలుపెట్టి తొలి సినిమాతోనే డిజాస్టర్ ని చవిచూశాడు. అయితే నటనపరంగా ఈ హీరోకి మాత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది అయితే ఈ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం SR. కళ్యాణ మండపం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో నటనపరంగా ఒక మెట్టు పైకి ఎక్కాడు కిరణ్ అబ్బవరం.

Exclusive - Ahead of Sammathame's OTT release, Kiran Abbavaram gets candid  about his success, chat with Allu Arjun, dream to meet Pawan Kalyan and  more | The Times of India

అయితే ఆ తర్వాత కిరణ్ అబ్బవరం నటించిన ఏ సినిమా కూడా అంతగా సక్సెస్ కాలేదు. ఇక తర్వాత సెబాస్టియన్, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాప్ గా అందుకోవడంతో ఈ హీరో కెరియర్ ఇప్పుడు కాస్త ఇబ్బందుల్లో పడిందని చెప్పవచ్చు. ఇక కిరణ్ అబ్బవరం చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి కచ్చితంగా ఈ సినిమాలు హిట్టు అందుకుంటాయని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ఇక కిరణ్ అబ్బవరం తన కెరీర్ పై ఆచితూచి అడుగులు వేయవలసిన అవసరం ఏర్పడింది.

సరైన కథలు ఎంచుకోకు ఉంటే మాత్రం కిరణ్ అబ్బవరం కెరియర్ గాడిలో పడడం కష్టమని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే గతంలో కూడా ఎంతో మంది హీరోలు సరైన కథలు ఎంపిక చేసుకోలేకపోవడం వల్ల కెరియర్ పరంగా సినిమాలకి గుడ్ బై చెప్పేసారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం వచ్చిన ప్రతి ఆఫర్ ని ఓకే చెబుతూ ఉన్నారని కామెంట్లు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి. దీంతో కిరణ్ అబ్బవరం సినిమాలు ప్లాప్ అవుతూ ఉండడంతో కాస్త నిరుత్సాహ పడుతున్నారు. దీంతో కెరీర్ పరంగా కిరణ్ అబ్బవరం సరైన నిర్ణయం తీసుకుంటే మంచిది.

Share post:

Latest