రామ్ చరణ్ అభిమానులకి శుభవార్త… బేబీ బంప్ తో కనిపించిన ఉపాసన, ఫొటోస్ వైరల్!

ఈ న్యూస్ కచ్చితంగా మెగాభిమానులకు కిక్కిచ్చే వార్త. ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులకి శుభవార్త అనే చెప్పుకోవాలి. ఎప్పటినుండో వారు ఆ వార్త వినడానికి తీవ్రంగా నిరీక్షిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ సంఘటనతో వారి కోరిక నెరవేరినట్టే కనబడుతోంది. మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు మెగా కోడలుగా వుంటూ, మరోవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలను చూసుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్న ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఆరోగ్య సలహాలు సూచనలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఇక అసలు విషయంలోకి వెళితే, రాంచరణ్ – ఉపాసన వివాహం జరిగి 10 సంవత్సరాలు పూర్తయింది. అయినా వీరికి సంతానం లేరు. కారణాలు ఏదేమైనప్పటికీ మెగాభిమానులకు ఈ విషయం జీర్ణించుకోలేని విషయం. మెగా వారసుడి కోసం వారు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నోసార్లు ఈ విషయంపై ఆమెకి ప్రశ్నలు ఎదురవగా… పిల్లలు కనడం అనేది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని సమయం వచ్చినప్పుడు తానే సమాధానం చెబుతా అంటూ దాటవేశారు.

అయితే ఆ తరుణం రానేవచ్చింది. ఆ విషయం చెప్పకనే చెప్పేసారు అంటున్నారు మెగాభిమానులు. అవును… తాజాగా గణేష్ నిమజ్జనం సందర్భంగా సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనం కార్యక్రమాలలో సందడి చేశారు. ఈ క్రమంలోనే ఉపాసన సైతం తన డ్రైవర్ ఇంటికి గణేష్ నిమజ్జన కార్యక్రమానికి వెళ్లారు. ఇలా ఈమె గణేష్ నిమజ్జనంలో సందడి చేస్తున్న సమయంలో ఈమె బేబీ బంప్ క్లియర్ గా కనిపించడంతో ఉపాసన ప్రెగ్నెంటా? అనే అనుమానం అనేకమందికి కలిగింది. ఇక ఈ విషయాన్నీ మెగాభిమానులు అయితే కన్ఫర్మ్ చేసేసుకుంటున్నారు. అయితే ఈ విషయమై ఇంకా క్లారిటీ రావలసి వుంది.

Share post:

Latest