బన్నీ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. పుష్ప 2లో అది వేరే లెవెల్ అట!

2 వారాల క్రితం బన్నీ నెక్స్ట్ మూవీ “పుష్ప 2” ముహూర్త కార్యక్రమం ఘనంగా జరిగింది. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి తన సమయాన్ని ఒక్క నిమిషం కూడా వృథా చేయడం లేదు. నివేదికల ప్రకారం, 2 రోజుల క్రితం ఈ మూవీ కోసం బన్నీ లుక్ ట్రయల్స్‌ లేదా టెస్టింగ్స్‌ హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగాయి.

ఈ లుక్ టెస్ట్‌లో అల్లు అర్జున్ మొదటిగా పాల్గొన్నాడు. కాగా ఈ ట్రయల్స్‌లో ఫస్ట్ పార్ట్‌లో ఉన్న పుష్ప రాజ్ లుక్‌ను సెకండ్‌లో పార్ట్‌లో పెద్దగా మార్చలేదని తెలుస్తోంది. అయితే అతను మరింత రఫ్ గా పుష్ప 2లో కనిపించనున్నాడట. ఇక షర్ట్స్‌ విషయంలో, స్టయిల్ చూపించడంలో కూడా కొన్ని మార్పులు చేశారు. ఈ మాడిఫైడ్ లుక్కు, స్టయిల్ వేరే లెవల్లో ఉండటం చూసి సుకుమార్ చాలా సంతోషించాడని ఇన్ సైడ్ టాక్. అల్లు అర్జున్‌తో కలిసి ఫస్ట్ పార్ట్‌లో నటించిన కొందరు పుష్ప: ది కన్‌క్లూజన్‌లో కూడా కనిపించనున్నారు. ఈ నటీనటులకు కూడా లుక్ ట్రయల్స్ జరిగాయి.

సినీ సర్కిల్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, పుష్ప 2 షూటింగ్ సెప్టెంబర్ 22 నుంచి స్టార్ట్ అవుతుంది. హైద‌రాబాద్‌లో జరగనున్న మొదటి షెడ్యూల్‌లో అల్లు అర్జున్, అతని గ్యాంగ్‌తో సహా చాలా మంది నటులు పాల్గొంటారు. ఈ షెడ్యూల్‌లో రష్మిక మందానతో అవసరం ఉండదని తెలుస్తోంది. ఈ ఫస్ట్ షెడ్యూల్‌లోనే బన్నీ అండ్ కోపై దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఓ పాటను షూట్‌ చేస్తారని అంటున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి కూడా కనిపించనుందని రూమర్స్ వచ్చాయి. అయితే ఇందులో వాస్తవం లేదని మూవీ టీమ్‌ స్పష్టం చేసింది.

Share post:

Latest