మహేష్ బాబు నుండి సరియైన సినిమాని కోరుకుంటున్న ఫ్యాన్స్… ఇప్పటికైనా వారి ఆశ తీరుతుందా? 

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గత కొన్నేళ్లుగా ఆయన వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అయితే హిట్లయితే పడుతున్నాయి కానీ, అవి ఓ మోస్తరుగానే ఆడుతున్నాయి. అభిమానులు ఎంత సంబరపడిపోయినా, ఒక విషయంలో మాత్రం అసంతృప్తిగా వున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని సినిమాలు ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘సర్కారు వారి పాట’ వంటి సినిమాలను ఒక్కసారి చూసుకుంటే… ఒకటే లైన్… చుట్టూ ఆ సినిమాలు తిరుగుతూ ఉంటాయి.

అయితే ఆ చట్రం నుండి బయటపడమని మహేష్ బాబుకి సూచిస్తున్నారు తన ఫాన్స్. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ వస్తున్నాయి కానీ.. ఈ విజయాల పట్ల సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా లేరని అర్ధం అవుతోంది. ఎందుకంటే ఇవన్నీ మహేష్ బాబు రేంజ్ హిట్లు కాదనేది వారు అభిప్రాయ పడుతున్నారు. ఈసారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకొని.. తన స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు చూపించాలని కోరుకుంటున్నారు మహేష్ ఫాన్స్.

ఇకపోతే గత కొంతకాలంగా మహేష్ఒ కే తరహా సినిమాలు చేస్తూ.. సబ్టిల్ రోల్స్ కే పరిమితం అవుతూ వస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ తో ట్రాక్ మారుస్తారని అందరిలో భావించారు. అయితే అది కూడా అభిమానులను నిరుత్సాహ పరిచింది. మహేశ్ సరికొత్త లుక్ లో కనిపించాడు కానీ.. ఈ సినిమా కంటెంట్ పరంగా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. మహేష్ కాకుండా ఇంకో హీరో ఎవరు చేసినా ఈ సినిమాలు ప్లాప్ అయ్యేవని ఫ్యాన్స్ నుంచి కామెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు ఎస్ఎస్ రాజమౌళి చిత్రాలతో మహేష్ బాబు సాలిడ్ హిట్స్ అందుకోవాల్సిన అవసరం ఉంది.

Share post:

Latest