చిరంజీవి ముందు అలా చేయమని చెప్పడంతో.. సినిమానే రిజెక్ట్ చేసిన ప్రముఖ నటి..!!

వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి చాలామంది అభిమానులను సంపాదించుకుంది నటి మాధవి రెడ్డి.. ఇక ఈమె పేరు చెబితే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక ఈమె చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈమె కెరియర్ ప్రారంభంలో ఆర్.నారాయణమూర్తి హీరోగా వచ్చిన ప్రజాస్వామ్యం అనే సినిమాలో హీరోయిన్గా కూడా నటించింది. ఇక ఈమె వకీల్ సాబ్ ,మజిలీ ,వంటి సినిమాలలో కూడా కీలకమైన పాత్రలో నటించింది.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవి రెడ్డి తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేసింది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Telugu Tv Actress Madhavi Reddy Biography, News, Photos, Videos | NETTV4U
మాధవి రెడ్డి మాట్లాడుతూ తన కెరీర్ ప్రారంభంలో కేవలం రెండు మూడు సినిమాలలోనే హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది.. అయితే ఆ సమయంలోనే నేను కేవలం తల్లి పాత్రలలో మాత్రమే నటించాలని ఫిక్స్ అయ్యాను.. అలా తల్లి పాత్రలోనే చేయడానికి గల కారణమేమిటంటే.. నేను కొన్ని షరతులు కూడా పెట్టుకున్నానని అందుచేతనే అలాంటి పాత్రలలో నటించానని తెలిపింది. నేను ఏదైనా సినిమాలో నటిస్తే ఆ సినిమాలో నటించిన పాత్ర వల్ల తన కుటుంబానికి ఏమాత్రం ఇబ్బంది ఉండకూడదని.. అందుకే నేను కేవలం తల్లి పాత్రలో నటిస్తానని ముందే చెప్పేస్తాను ఒకవేళ నేను షూటింగ్ సెట్టుకు వెళ్లాక తన పాత్ర నచ్చకపోతే నిర్మొమాటంగా నాకు నచ్చలేదని చెప్పి సెట్ నుండి బయటికి వచ్చేస్తానని తెలియజేసింది.

ఇక అలాగే తన కెరియర్ లో ఏవైనా సినిమా షూటింగ్ నుంచి తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయని ప్రశ్న యాంకర్ అడగగా.. అవును ఉన్నది.. ఒకసారి చిరంజీవి గారి సినిమాలో నటించడానికి షూటింగ్ కి వెళ్ళాను కానీ అక్కడ వాళ్ళు నన్ను చిరంజీవి ముందు పైట.. జార్చే సన్నివేశంలో నటించమన్నారు కానీ నాకు ఆ సన్నివేశం ముందు తెలియదు చెట్టుకు వెళ్లాక ఆ విషయం తెలిసి నేను చేయను అని చెప్పి వచ్చేసానని తెలిపింది.

Share post:

Latest