ఏలూరు తమ్ముళ్ళ దూకుడు..ఏడూ లాగేస్తారా?

మరి ఘోరమైన ఓటమి ఎదురవ్వడం కావొచ్చు..లేదా కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో కూడా ఓడిపోయిన అవమాన భారం కావొచ్చు..అలాగే వైసీపీ అధికార బలంతో అణిచివేసే కార్యక్రమాలకు రివర్స్ అవ్వడం కావొచ్చు..ఊహించని విధంగా ఏలూరు తెలుగు తమ్ముళ్ళు మాత్రం..టీడీపీని పైకి లేపే కార్యక్రమం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు సీట్లలో టీడీపీ ఓడిపోయింది.

ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు సీట్లలో వైసీపీ గెలిచింది. అయితే గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు..మూడేళ్లలో ఆయా నియోజకవర్గాలకు పెద్దగా చేసిందేమి లేదు. ఏదో పథకాలు ఇవ్వడం తప్ప..అలాగే నియోజకవర్గాల్లో అభివృద్ధి కుంటుపడింది..ఇక కొందరు వైసీపీ నేతల అక్రమాలు పెరిగిపోయాయి..అటు ప్రజలపై పన్నుల భారం విపరీతంగా పెరిగింది. ఈ పరిస్తితుల నేపథ్యంలో ఏలూరు టీడీపీ నేతల పోరాటం అద్భుతంగా సాగింది. ఎవరికి వారు తమ నియోజకవర్గాల పరిధిలో ప్రజా సమస్యలపై పోరాటం చేశారు.

ముఖ్యంగా ఏలూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు తనదైన శైలిలో పనిచేస్తూ…నేతలని సమన్వయం చేసుకుంటూ..ప్రజా క్షేత్రంలో పోరాటాలు గట్టిగా చేశారు. పార్టీ పిలుపునిచ్చిన్న ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ వచ్చారు. నేతలంతా కలిసికట్టుగా మళ్ళీ ఏలూరులో టీడీపీకి పునర్వైభవం తీసుకొచ్చే దిశగా పనిచేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా తెలుగు యువత చేపట్టిన నిరుద్యోగ రణం పాదయాత్ర ఏలూరులో సూపర్ సక్సెస్ అయింది.

గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్ర సక్సెస్ అయింది. కాకపోతే ఏదో సింపుల్ గా ఈ యాత్ర జరిగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఏలూరు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లోనే యువత..పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొంది. దీంతో ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అయింది. అయితే టీడీపీ నేతలు ఇదే స్థాయిలో పనిచేస్తే..ఏలూరు పరిధిలోని ఏడు స్థానాలని టీడీపీ కైవసం చేసుకోవడం గ్యారెంటీ అని విశ్లేషణలు వస్తున్నాయి.