ఈ దరిద్రపు అలవాటు ఆ బాలీవుడ్ లో మాత్రమే చూశాను .. దుల్కర్ సంచలన కామెంట్స్..!?

మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వాడుతున్న పదం బాయి కాట్. ఒకప్పుడు పైరసీ అనే భూతం సినీ ఇండస్ట్రీ ని ఎలా పట్టి పీడించిందో .. ఇప్పుడు బాయ్ కాట్ అనే పదం సినీ ఇండస్ట్రీను వైరస్ లా వెంటాడుతుంది. సినిమాలో ఏదైనా హద్దులు మీరి సీన్లు ఉంటే చాలు.. బాయ్ కాట్ సినిమా అంటున్నారు. ఆ సీన్ గి తొలగించమని చెప్పకుండా సినిమానే బాయ్ కాట్ చేయడం ఏంటి అంటూ సినీ విశ్లేషకులు సైతం షాక్ అవుతున్నారు


అయితే ఇలాంటి బాయ్ కాట్ ట్రెండ్ పై రీసెంట్ గా హిట్ కొట్టిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ సంచలన కామెంట్స్ చేశారు. అసలు ఈ బాయ్ కాట్ ట్రెండ్ సృష్టించింది బాలీవుడ్ ఏ కదా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ లో తీవ్ర రూపం దాల్చిన బాయ్ కాట్ ట్రెండ్ ని పలువురు చిత్ర ప్రముఖులు వ్యతిరేకిస్తున్నారు. కాగా ఇలాంటి టైం లో హీరో దుల్కర్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి.

ఆయన మాట్లాడుతూ..” ఈ దారుణమైన బాయ్ కాట్ కల్చర్ బాలీవుడ్ లోనే చూస్తున్నాను. సౌత్ ఇండస్ట్రీలో ఇలాంటి వాతావరణమే లేదు ..పెరిగిపోతున్న టెక్నాలజీకి మారుతున్న కాలానికి ..సోషల్ మీడియా విప్లవం నేపథ్యంలో ఎవరికి ఇష్టం వచ్చిన విషయాలు వాళ్ళు ట్రెండ్ చేస్తున్నారు” అంటూ ఘాటుగా స్పందించాడు. మరి చూడాలి దుల్కర్ చేసిన ఈ హాట్ కామెంట్స్ పై బాలీవుడ్ ప్రముఖులు ఎవరైనా మాట్లాడుతారా లేదా నిజమే కదా అంటూ గప్ చుప్ గా కూర్చుంటారో..?

Share post:

Latest