రాజకీయ లబ్ధి కోసం మనోభావాలతో ఆడుకోవద్దు.. కళ్యాణ్ రామ్..!

తాజాగా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ విజయవాడలో ఉన్న వైద్య విద్యాలయానికి ఎన్టీఆర్ పేరును తొలగించి వైయస్సార్ పేరును జోడించడంతో పలు రకాలుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ క్రమంలోనే స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడు కళ్యాణ్ రామ్ కూడా వైసీపీ పార్టీపై అలాగే జగన్మోహన్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక తాజాగా ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేయడం జరిగింది. ఇక రాజకీయ లబ్ధి కోసం జగన్ మోహన్ రెడ్డి ఇలా మా తాత పేరును మార్చి తమ తండ్రి పేరును పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు.Dr NTR University of Health Sciences Provisionally Promotes all MBBS, BDS,  AYUSH, Nursing Students for Next

కళ్యాణ్ రామ్ తన ట్విట్టర్ ఖాతాలో ఏం రాసుకొచ్చారు అంటే.. 1986లో విజయవాడలో మెడికల్ యూనివర్సిటీ స్థాపించబడింది.ఆంధ్రప్రదేశ్లోని మూడు ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకున్న శ్రీ ఎన్టీఆర్ గారు ఈ మహా విద్యాలయానికి అంకురార్పణ చేశారు. ఈ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెందింది. లెక్కలేనన్ని నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులను దేశానికి అందించింది. తెలుగు రాష్ట్రాలలో వైద్య అధ్యయనాలు మెరుగుదలకు ఆయన చేసిన కృషిని స్మరించుకునేందుకు విశ్వవిద్యాలయానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పేరు మార్చబడింది.Dr. NTR University of Health Sciences Convocation Held in Vijayawada | News

ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. 25 ఏళ్లకు పైగా ఉనికిలో ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం పేరును మార్చడం నాకు బాధ కలిగించింది.. కేవలం రాజకీయ లాభం కోసం చాలామందికి భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని వాడుకోవడం తప్పు అంటూ కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. ఇక కళ్యాణ్ రామ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన ట్వీట్ ద్వారా ఎవరిని కించపరచకుండా ట్వీట్ చేయడంతో ఎన్టీఆర్ గోడ మీద పిల్లిలా ప్రవర్తిస్తున్నాడు అంటూ విమర్శలు కూడా ఎదుర్కోవడం జరిగింది. ఏది ఏమైనా ఎన్టీఆర్ పేరుని తొలగించడంతో సర్వత్ర విమర్శలను ఎదుర్కొంటుంది వైసీపీ ప్రభుత్వం.

https://twitter.com/NANDAMURIKALYAN/status/1572898046936956928?s=20&t=du4CDaaFTedcR0tw-mAwfQ