ఎన్టీఆర్ – ఏఎన్నార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమను మద్రాస్ నుంచి హైదరాబాద్ కి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్ – ఏఎన్ఆర్ కు దక్కుతుంది. ముఖ్యంగా ఎంతోమంది తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంపొందించే ప్రయత్నం చేశారు. అలాంటివారిలో తెలుగు చిత్ర సీమకు మూల స్తంభాలుగా రెండు కల్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే ఇద్దరికీ కూడా స్వతహాగా అభిమానులలో మంచి గుర్తింపు ఉంది . ఇదిలా ఉండగా ఇద్దరు కూడా స్టార్ హీరోలుగా కొనసాగుతున్న సమయంలో ఏ మాత్రం తేడాలు చూపించకుండా ఏకంగా 14 చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు కన్నుల విందు చేశారు. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

unknown facts about ntr and anr details, akkineni nageswara rao, nandamuri  taraka rama rao, tollywood industry, patalabhairavi movie, ntr anr friends,  senior actors, movies offers, palleturi pilla - Telugu Offers,  Nandamuritaraka, Ntr
తెలుగు చిత్రం పరిశ్రమ మాటలు నేర్చిన 9 సంవత్సరాల తర్వాత ధర్మపత్ని అనే సినిమా ద్వారా తెలుగు తెరకు అక్కినేని నాగేశ్వరరావు పరిచయం అయ్యారు. ఇక ఆ తర్వాత ఏడు సంవత్సరాలకు మన దేశం సినిమా ద్వారా ఎన్టీఆర్ పరిచయం అవ్వడం జరిగింది. ఇద్దరు కూడా స్టార్ ఇమేజ్ ను కొనసాగుతున్న సమయంలో 1950లో పల్లెటూరి పిల్లతో వీరి కాంబినేషన్ మొదలైంది.1950 లో సంసారం, 1954లో పరివర్తన, 1955లో మిస్సమ్మ , 1956లో తెనాలి రామకృష్ణ , 1956 లోని చరణదాసి , 1957లో మాయాబజార్, 1958లో భూకైలాస్, 1962లో గుండమ్మ కథ, 1963 లో శ్రీకృష్ణార్జునయుద్ధం, 19 77లో చాణక్య చంద్రగుప్త, 1978లో రామకృష్ణులు, 1981లో సత్యం శివం చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. ఇకపోతే 1954లో రేచుక్క సినిమాలో అక్కినేని గెస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ - ఏఎన్నార్ః సీనియ‌ర్ ఎవ‌రో తెలుసా..? - OK Telugu
ఇక ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో ఏకంగా 14 చిత్రాలు రావడం గమనార్హం. ఇక ప్రపంచంలోనే ఇంతటి అరుదైన రికార్డును వీరే సృష్టించారు. పౌరాణిక, జానపద, చారిత్రక , సాంఘిక, చిత్రాలలో ప్రపంచ సినీ చరిత్రలో ఏ ఇద్దరు అగ్రనటులు ఇన్ని సినిమాలలో ఇన్ని జ్యానర్స్ లో కలిసి నటించలేదు. ఇది ఒక అద్భుతమైన రికార్డు అని చెప్పడంలో సందేహమే లేదు.

Share post:

Latest