విక్టరీ వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమా ఏంటో తెలుసా..?

సాధారణంగా సెలబ్రిటీల పిల్లలు ఖచ్చితంగా చైల్డ్ ఆర్టిస్టుగా నటిస్తారు అని చెప్పడంలో సందేహం లేదు. అలా ఎంతోమంది సెలబ్రిటీలు తమ వారసులను చైల్డ్ ఆర్టిస్టులు గా ఇండస్ట్రీలోకి ప్రవేశపెడుతూ ఉంటారు. ఇక అలాంటి వారిలో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. నిజంగా విక్టరీ వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు అంటే బహుశా నమ్మడానికి కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంటుంది. కానీ ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమా కూడా ఒకటి ఉంది. ఇకపోతే వెంకటేష్ ఆరు పదుల వయసులో కూడా మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు మాస్ హీరో గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. మరొకవైపు ఫ్యామిలీ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది.

ఇక ఇటీవల వచ్చిన నారప్ప, దృశ్యం 2 రెండు సినిమాలు కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి . ఇక ఇప్పుడు ఈయన మరొక ప్రాజెక్టుతో మన ముందుకు రానున్నట్లు సమాచారం. ఇక మరొకవైపు బాలీవుడ్ లో కూడా ఒక సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. విక్టరీ వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న సినిమా ఏమిటి అనే విషయానికి వస్తే.. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా చేసిన ప్రేమ్ నగర్ అనే సినిమాలో విక్టరీ వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఇక ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించమని .. వెంకటేష్ తండ్రి డి.రామానాయుడు గారు వెంకటేష్ ను అడిగారట. అంతేకాదు ప్రేమ్ నగర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తే రూ.1000 ఇస్తానని కూడా రామానాయుడు వెంకటేష్ కు చెప్పడంతో వెంకటేష్ సరే అని ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఇక తర్వాత ఆయన ఏ సినిమాలో కూడా అలా నటించలేదు. ఇకపోతే ప్రేమ్ నగర్ ఎలాంటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే.

ఇక ఆ తర్వాత నాగార్జునకు పోటీగా హీరో గా కలియుగ పాండవులు సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు వెంకటేష్. ఈ సినిమా వెంకటేష్ కు మంచి విజయాన్ని అందించింది. ఇక ఈ సినిమా ద్వారా కుష్బూ కూడా హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయం అయింది.

Share post:

Latest