ఆ హీరో దెబ్బకు కళ్యాణ్ రామ్ ఆస్తులు అమ్మేశారని తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక ఈ కుటుంబం నుంచి నటులుగా ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ముఖ్యంగా బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తారకరత్న తదితర హీరోలు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే కళ్యాణ్ రామ్ మాత్రం కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే సినిమాల పరంగా తక్కువ సక్సెస్ లో ఉన్నప్పటికీ టాలీవుడ్ లో మాత్రం తనకంటూ సెపరేట్ ఇమేజ్ ని సంపాదించుకున్నారు.

raviteja missed the nandamuri kalyan ram bimbisara movie, bimbisara, flim  news, kalyan ram, nandamuri fans, ravi teja - Telugu Bimbisara, Kalyan Ram,  Nandamuri Fans, Ravi Teja

అయితే కళ్యాణ్ రామ్ రవితేజ తో కలిసి కిక్-2 సినిమాని నిర్మించారు.ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు కళ్యాణ్ రామ్. ఈ చిత్రానికి దర్శకత్వం సురేందర్ రెడ్డి వ్యవహరించారు. ఈ సినిమాతో కొన్ని కోట్ల రూపాయలు నష్టం వాటిల్లడం జరిగింది. దీంతో తనకి ఉన్న కొన్ని ఆస్తులను కూడా అమ్మినట్లు సమాచారం. కిక్ సినిమా హిట్ కోటడంతో కిక్ 2 కూడా మంచి విజయవంతం అవుతుందని అంచనా వేశారు కళ్యాణ్ రామ్.. కానీ ఈ చిత్రం ఘోరంగా ప్లాప్ ను చవిచూసినది. అయితే ఈ సినిమాకి ఎక్కువ బడ్జెట్ కావడానికి గల ముఖ్య కారణం ఈ సినిమాని చాలాసార్లు రీ షూట్ చేయడమే అని చెప్పవచ్చు.

Ravi Teja paid Rs 10 crore to producer Kalyan Ram for Kick 2's loss? -  Bollywood News & Gossip, Movie Reviews, Trailers & Videos at  Bollywoodlife.com
కానీ ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డారు. ఇక ఆ తర్వాత తన తమ్ముడితో కలిసి జై లవకుశ సినిమాని నిర్మించగా ఈ సినిమాతో మిగిలిన అప్పులను కట్టేసి కాస్త లాభాలలో నిలిచారని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం బింబిసార సినిమానీ తన బ్యానర్ పై నిర్మించి నిర్మాతగా వ్యవహరించి మరింత లాభాల బాటలో చేరాడు కళ్యాణ్ రామ్. ఇక కళ్యాణ్ రామ్ తన తదుపరి సినిమా గురించి ఇంకా ప్రకటించలేదు.

Share post:

Latest