నేషనల్ క్రష్ కాలేజ్ డేస్ లో ఎలా ఉండేదో తెలుసా.. వీడియో వైరల్..!!

తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది హీరోయిన్ రష్మిక మందన్న. ఛలో సినిమాతో మొదటిసారిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా పేరుపొందింది. ఈమె నటించిన సినిమాలలో ఎక్కువ శాతం మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు కావడంతో ఈమె కెరియర్ ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉందని చెప్పవచ్చు. ఇక అందం, అభినయంతో పాటు ఈమె మాటలకు కూడా అభిమానులు ఫీదా అవుతూ ఉంటారు. కన్నడలో పలు సినిమాలలో నటించిన రష్మిక తెలుగులో మాత్రం మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవరు సినిమాతో నటించడంతో ఇమే క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఆ తర్వాత తమిళంలో కూడా పలు సినిమాలలో చేస్తూ అలరిస్తూ ఉన్నది. ప్రస్తుతం పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా పేరుపొందింది. హీరోయిన్ గానే కాకుండా ఏదైనా సినిమా లో ఈమె పాత్రకు ప్రాధాన్యత ఉంటే కచ్చితంగా ఆ సినిమాలో నటిస్తూ ఉంటుంది. అలా సీతారామం సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం విజయ్ దళపతి తో వారసుడు అనే సినిమాలో నటిస్తూ ఉన్నది.

ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది రష్మిక. అప్పుడప్పుడు తన సినిమాలకు సంబంధించి పర్సనల్ విషయాలకు సంబంధించి కొన్నిటిని షేర్ చేస్తూ ఉంటుంది. అయితే రష్మిక కాలేజ్ డేస్ కి సంబంధించి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఒక ఈవెంట్లో డాన్స్ చేస్తూ కనిపించి ఈ ముద్దుగుమ్మ అందరిని బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం రష్మిక సంబంధించి ఈ వీడియో మాత్రం చాలా వైరల్ గా మారుతోంది.

Share post:

Latest