బ్లాక్‌బ‌స్ట‌ర్ ‘ హ‌నుమాన్ జంక్ష‌న్ ‘ సినిమా మిస్ చేసుకున్న ఇద్ద‌రు స్టార్ హీరోలు వీళ్లే…!

సాధారణంగా ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో హీరో చేసే ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అవుతుందని అలాగే ఫ్లాప్ అవుతుందని ఎవరూ కూడా ఊహించలేరు. అదంతా సినిమా చూసే ప్రేక్షకుడి చేతిలో ఉంటుంది. అయితే ప్రేక్షకుడికి నచ్చేలా సినిమా కథ‌ ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అవడం లేదా నచ్చకపోతే ఫ్లాప్ అవడం జరుగుతుంది. అంతేకాదు ఒక హీరో చేయాల్సిన సినిమా మరొక హీరో చేసి ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడం సినీ ఇండస్ట్రీలో సర్వసాధారణమైన విషయం.

ప్రేక్షకులకు కొన్ని సినిమాల విషయంలో మాత్రమే ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి. కొన్ని సినిమాల విషయంలో ఇలాంటివి జరిగాయ‌న్న సంగతి కూడా ఎవరికి తెలియదు. ప్రేక్షకులను అలరించి బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఓ సినిమా విషయంలో మాత్రం అచ్చంగా ఇలాగే జరిగిందట. ఆ సినిమా ఏదో కాదు ఒకప్పటి స్టార్ హీరోలైన అర్జున్, జగపతిబాబు మల్టీ స్టార‌ర్ గా నటించిన `హనుమాన్ జంక్షన్` సినిమా. అయితే ఈ సినిమా ఒకప్పటి మల్టీస్టారర్ హీరోలు వదిలేసుకున్నారట.

అయితే రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళ మూవీ `లూసీ ఫర్` రీమేక్ గా `గాడ్ ఫాదర్` సినిమా మోహన్ రాజా తెరకెక్కించబోతున్నారు. అయితే అప్పట్లో మోహన్ రాజానే `హనుమాన్ జంక్షన్` సినిమాని కూడా తెర‌కెక్కించారన్న విషయం తెలిసిందే. ఇటీవల `గాడ్ ఫాదర్` ప్రమోషన్స్ లో భాగంగా `హనుమాన్ జంక్షన్` సినిమా గురించి ఆసక్తికర విషయాలు బయట పెట్టారు. ముందుగా అర్జున్, జగపతిబాబును హీరోలుగా ఈ సినిమాకి ఎంపిక చేయలేదట.

మోహన్ బాబు – రాజశేఖర్లతో ఈ సినిమా చేయాలని అనుకున్నాడట. అయితే వాళ్ళిద్దరూ అడ్వాన్సులు కూడా తీసుకున్నారట. ఆ త‌ర్వాత ఎడిటర్ మోహ‌న్‌ జగపతిబాబును, అర్జున్ ను సజెస్ట్ చేశారని మోహన్ రాజా ఈ ప్రమోషన్స్ లో భాగంగా చెప్పుకొచ్చారు. అప్పట్లో ఈ మల్టీస్టారర్ సినిమా మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది.

Share post:

Latest