బాలయ్య కోసం అనసూయని రంగంలోకి దింపుతున్న డైరెక్టర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడంతో బాలయ్య అభిమానులు కూడా తన తదుపరిచిత్రంపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఇంకా #NBK -107 అనే వర్కింగ్ టైటిల్ మాత్రమే పెట్టడం జరిగింది.ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక కనడ స్టార్ హీరో దునియా విజయ్ కూడా కీలకమైన పాత్రలు నటిస్తూ ఉండగా వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటిస్తోంది.

Balakrishna calls Anasuya - Atta అనసూయని అత్తా అనేసిన బాలయ్య
ఇటీవల కర్నూలులో ఈ సినిమాకు సంబంధించి కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.ఆ తర్వాత టర్కీ కూడా వెళ్లడం జరిగింది. నవంబర్ నెలలో ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేయాలని డైరెక్టర్ గోపీచంద్ ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాని వచ్చే ఏడాది లేదా ఈ ఏడాది చివరి కల్లా విడుదల చేయాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ గ్లింప్ప్ పవర్ ప్యాక్ గా విడుదల చేయడంతో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. బాలకృష్ణ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించారు. బాలయ్య ఈ చిత్రంలో మళ్లీ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు.

Earth-staggering budget for Balakrishna - Anil Ravipudi film..? -  TeluguBulletin.com
ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన 108వ సినిమాని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ ఒక ఏజుబార్ పర్సన్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. బాలకృష్ణ కూతురుగా శ్రీ లీలా కూడా నటిస్తోంది. అయితే ఇందులోని ఒక స్పెషల్ సాంగ్ కోసం అనసూయని రంగంలోకి దించుతున్నట్లుగా సమాచారం అందుకోసం పలు చర్చలు కూడా జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి అనసూయ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో తెలియాల్సి ఉంది.

Share post:

Latest