థ‌మన్ మ్యూజిక్‌కి భయపడుతున్న.. హీరోల ఫ్యాన్స్..!

ఎన్నో సెన్సేషన్లు క్రియేట్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఉన్న అగ్ర హీరోల సినిమాలు అందరికీ థమన్‌నే మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్నాడు. కాగా థ‌మన్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది స్టార్ హీరోల సినిమాలుకు థ‌మన్ వర్క్ చేస్తున్నాడంటే అభిమానుల్లో ఏదో తెలియని భయం మొదలవుతుందట. దీనికి ముఖ్య కారణం ఆయన ఇస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అని తెలుస్తుంది.

S S Thaman అంటే వాళ్లకి భయం మొదలైందా..?

వరస హిట్ సినిమాలు పడేసరికి థ‌మ‌న్‌లో హెడ్ వెయిట్ పెరిగిపోయిందట. అందుకే బిగ్ స్టార్ సినిమాల అని కూడా చూడకుండా డప్పుల సౌండ్లు కొడుతూ రోత మ్యూజిక్ ఇస్తున్నాడని చెప్పి స్టార్ హీరోల ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు తమన్ కి కాపీ రాజా అనే పేరు కూడా ఉంది ఇండస్ట్రీలో. దీనివల్ల థ‌మన్ చాలా ఆఫర్స్ ని కోల్పోయాడంటూ సోషల్ మీడియాలో గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఒక‌నొక‌ టైం లో సినిమాలు చేద్దామన్న ఆఫర్లు ఇవ్వడానికి మేకర్స్ ఆయన దగ్గరకు వచ్చేవారు కాదట.

Thaman S Speech @ Ala Vaikunthapurramuloo Thanks Meet | #AVPLSankranthiWinner | Allu Arjun Trivikram - YouTube

ఇదే క్రమంలో తాజాగా వచ్చిన అలా వైకుంఠ‌పురం సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు ఎస్ ఎస్ థ‌మన్. ఆ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ పాటలు సూపర్ హిట్ అవడంతో మళ్లీ గత వైభవాన్ని అందుకొన్నాడు థ‌మన్.
దింతో వరుస‌ సినిమాలు చేసుకుంటూ బిజీ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ప్రస్తుతం థ‌మన్‌ టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోల సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా ఉంటూ బిజీగాా ఉన్నాడు. ఇప్పుడు ఆ హీరోల అభిమానులకి ఒక టెన్షన్ పట్టుకుంది.

Producers Know What I Should Be Paid: SS Thaman

రీసెంట్‌గా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విన్న అభిమానులు మళ్లీ తమన్ పాత డప్పు సౌండ్ కే వచ్చాడని… ఇదేవిధంగా థ‌మన్ మ్యూజిక్ అందిస్తే మళ్లీ కెరియర్ లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సినీ ప్రముఖులు అంటున్నారు. థ‌మన్ తాను చేసిన సినిమాలలో మ్యూజిక్ ని మార్చి మార్చి తన కొత్త సినిమాలకి ఇస్తున్నాడు. దీంతో హీరోల అభిమానులకు థ‌మన్ మ్యూజిక్ అంటే నచ్చటం లేదు. దీంతో థ‌మన్ పై సోషల్ మీడియాలో అభిమానులు చాలా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

Share post:

Latest