ఆహా కోసం రమ్యకృష్ణ అన్ని కోట్ల రెమ్యూనరేషన్ అందుకుందా..?

తెలుగులో ఓటీటీ ఆహాలో ఇటీవల వరుస అప్డేట్లను ప్రకటిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ బాగా ముందుకు దూసుకు వెళ్తుంది. ఇక ఇందులోని సింగింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఓంకార్ సారధ్యంలో భారీ డాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆహా సంస్థ మరొకసారి ముందుకు వచ్చింది. డ్యాన్స్ ఐకాన్ అనే పేరుతో ఆహా వారు తెలుగు ప్రేక్షకుల కోసం ఈ షోని ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి జడ్జిగా రమ్యకృష్ణ కూడా వ్యవహరిస్తూ ఉన్నారు.

Ramya Krishna Introduces As Judge With Dance Icon Show In AHA OTT - Sakshi

ఇక రమ్యకృష్ణతోపాటు.. శ్రీముఖి, శేఖర్ మాస్టర్ తదితరులు కూడా ఈ షో లో పాల్గొనబోతున్నారు. రమ్యకృష్ణ ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరొకవైపు ఇలాంటి షోలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నది. ఇక డ్యాన్స్ కార్యక్రమానికి రమ్యకృష్ణ ఒప్పుకోవడానికి ముఖ్య కారణం ఆమె పారితోషకమే అన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆమె ఒక్కో ఎపిసోడ్ కి రూ.4 లక్షల నుంచి 4.5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటోంది అన్నట్లుగా టాకు వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి డ్యాన్స్ కాంపిటీషన్ జడ్జిగా ఇంతటి రెమ్యూనరేషన్ అందుకున్న జడ్జిలు లేరని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Ramya Krishnan makes grand entry on Dance Ikon, her OTT debut as judge.  Watch | Web Series - Hindustan Times

హిందీలో ప్రసారమవుతున్న డ్యాన్స్ వంటి కార్యక్రమాలకు కూడా ఇంతటి రెమ్యూనరేషన్ ఇవ్వడం లేదన్నట్లుగా సమాచారం. ఇక ఈ షో తో రమ్యకృష్ణ రికార్డు స్థాయిలో బుల్లితెరపై ఇంతటి రెమ్యూనరేషన్ అందుకోవడంతో ఇండస్ట్రీ వర్గాలలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం డ్యాన్స్ ఐకాన్ గురించి ఒక రేంజ్ లో ప్రచారం జరుగుతున్నది. ఇక ఈ షో లోనే హాలీవుడ్ స్థాయిలో మెప్పించే నిర్వాహకులు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ఈ కార్యక్రమానికి సంబంధించి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కూడా కాబోతున్నట్లు ఒక ప్రోమో ని విడుదల చేశారు. మరి రమ్యకృష్ణ తను తీసుకునే నిర్ణయానికి తగ్గట్టుగా న్యాయం చేస్తుంది అని ఆమె అభిమానుల సైతం భావిస్తున్నారు.

Share post:

Latest