ద్యావుడా..బ్రహ్మాస్త్ర సినిమా కోసం రాజమౌళి ఏకంగా అన్ని కోట్లు తీసుకున్నాడా..?

బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకొని ఉన్నారు. అయితే విజువల్ ఎఫెక్ట్స్ మరీ టూమచ్ గా ఉండడంతో థియేటర్స్ కి వెళ్ళిన జనాలు కళ్ళు పోతాయేమో అని భయపడి థియేటర్స్ కి వెళ్లడమే మానేశారు. అంతలా టూ మచ్ గ్రాఫిక్స్ ఈ సినిమాలో ఉందంటూ టాక్ బయటకు వచ్చింది.

ఈ సినిమా కి తెలుగులో సమర్పికుడిగా వ్యవహరించాడు దర్శక ధీరుడు రాజమౌళి. జక్కన్న ఏ ప్రాజెక్టు పడితే ఆ ప్రాజెక్టు సూపర్ సక్సెస్ అవుతుందని ఓ నమ్మకం ఇండస్ట్రీలో ఉంది . కానీ ఈసారి ఆ లెక్క తప్పింది. ఫస్ట్ టైం రాజమౌళి తీసుకున్న నిర్ణయం తప్పు అని తేలింది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో రాజమౌళి ఎంత యాక్టివ్ గా పాల్గొన్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు .ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాలకు కూడా ఈ రేంజ్ ప్రమోషన్స్ చేయలేదు. ఆఖరికి బుల్లితెర షో కి కూడా గెస్ట్ గా వచ్చాడు రాజమౌళి. అంతలా ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు రాజమౌళి.

కాగా తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. ఈ సినిమాను ప్రమోట్ చేసినందుకు గాను రాజమౌళి ఏకంగా నిర్మాతల దగ్గర నుంచి 17 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ గా తీసుకున్నాడట . దీంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. కేవలం ప్రమోట్ చేసినందుకే 17 కోట్ల రూపాయలా..? అంటూ షాక్ అవుతుంది. ఆఫ్ కోర్స్ సినిమా హిట్ అయి ఉంటే ఇలా ఆలోచించేవారు కాదేమో ..కానీ, రాజమౌళి స్థాయికి ఈ రెమ్యూనరేషన్ తక్కువే అని అంటున్నారు సినీ విశ్లేషకులు. మనకు తెలిసిందే బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో రాజమౌళి తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. కాగా ఎన్ని కోట్లు ఆస్తి ఉన్నా రాజమౌళి సింప్లిసిటీనే ఇష్టపడతారు. మరి ఇంత డబ్బులు ఏం చేస్తారో ఆయనకే తెలియాలి..!!

Share post:

Latest