ఎన్టీఆర్ కొమ‌రం భీం కోసం ఇంత రిస్క్ చేశాడా… టాప్ సీక్రెట్ రివీల్‌…!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో ఎన్టీఆర్ కు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ఎలాంటి నటనతోనైనా ప్రేక్షకులను మైమరిపిస్తూ ఉంటాడు ఎన్టీఆర్. డాన్స్ పరంగా చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని ఢీ కొట్టే హీరో ఇప్పటివరకు రాలేదని కూడా చెప్పవచ్చు. అలా తన పాత్రకు తగ్గట్టుగానే మారిపోతూ ఉంటారు ఎన్టీఆర్. అందుచేతనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఎన్టీఆర్ నటించిన RRR సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాని డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ ఏడాది మార్చి నెలలో విడుదలైంది.

Jr NTR looks fierce as Komaram Bheem in new RRR promo. Seen yet? - Movies  News

విడుదలైన ప్రతి భాషలో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది . ఇక సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కూడా నటించారు. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ చాలా పవర్ ఫుల్ గా నటించారు. ఇక కొమరం భీం పాత్రలో చాలా బలిష్టంగా ఎన్టీఆర్ కనిపించాలి అందువలన ఎన్టీఆర్ బరువు పెరగవలసి వచ్చిందట. అందుకు తగిన ఫిట్నెస్ కోసం జిమ్ లో వర్కౌట్ కూడా చేయవలసి వచ్చింది. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ చాలానే కష్టపడ్డాడు అనే విషయం..ఆయన నటనను చూస్తే మనకి అర్థమవుతుంది.

Jr NTR's Komaram Bheem Turns Into a Spiritual Muslim Man From a Fierce  Warrior in Teaser of SS Rajamouli's RRR | India.com

ఇక రాజమౌళి అనుకున్న విధంగా కనిపించడానికి ఎన్టీఆర్ దాదాపుగా 18 నెలల పాటు కష్టపడ్డారట. ఆ సమయంలో ఆయన క్రమం తప్పకుండా వర్కౌట్ చేసేవారని ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సైతం షాక్ అయ్యారు. ఇక ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఫిట్నెస్ ట్రైనర్ గా ఉన్న లాయిడ్ స్టీవెన్ తన ట్విట్టర్లో తెలియజేశారు. అందుచేతనే RRR సినిమాలో ఎన్టీఆర్ కాకుండా కొమరం భీమ్ కనిపించాడని తెలియజేశాడు. యాక్షన్ లోనూ. ఎమోషనల్ గానూ.. కొమరం భీమ్ నటన అద్భుతంగా ఉందని, ఇలా కనిపించడానికి ఆయన పడిన కష్టమే.. చేసిన కసరత్తు అని తెలియజేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ సినిమాని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయవలసి ఉంది.

Share post:

Latest