మంచు మనోజ్ సినిమా చేయకపోవడానికి కారణం అదే అంటున్న ధనరాజ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతొంది. ఇక అడపదడప సినిమాలు చేస్తూ మంచు మనోజ్ ఉన్నారు..సినిమాలపై ఈ మధ్యకాలంలో పెద్దగా ఆసక్తి చూపలేదు దీంతో మంచు మనోజ్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇక ఈ విషయంపై ప్రముఖ కమెడియన్లలో ఒకరైన ధనరాజ్ మంచు మనోజ్ కు మంచి సన్నిహితుడు కావడం వల్ల తాజాగా ఒక ఇంటర్వ్యూలో మనోజ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

Dhanraj (Comedian) Actor, Wiki, Biography, Age, Family, Wife, Caste, Bigg  Boss

ధనరాజ్ మాట్లాడుతూ.. మనోజ్ తో తనకు మంచి రిలేషన్ ఉందని ధనరాజ్ తెలియజేశారు. మనోజ్ హీరోగా తెరకెక్కించిన కరెంట్ తీగ సినిమాలో నేను నటించానని ధనరాజ్ తెలిపారు. జంప్ జిలాని ఆడియో ఫంక్షన్ లో మాత్రం మనోజ్ నేను ఒక ఫ్రాంక్ వీడియోను కూడా చేశామని తెలిపారు. అయితే అప్పుడు ఆ వీడియో మాత్రం వైరల్ గా మారింది ఆ సమయంలో మొత్తం అందరూ తప్పుగా అతనిని అర్థం చేసుకున్నారని తెలిపారు ధనరాజ్. ఇక ఈ విషయంపై తన మీద ట్రోల్స్ వస్తున్నాయని చెప్పడంతో మంచు మనోజ్ తనతో ఒక సెల్ఫీ ని షేర్ చేద్దామని చెప్పారని దాని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దామని తెలిపారట.

Manchu Manoj warning to Dhanraj @ Jump Jilani Audio Launch | Silly Monks -  YouTube
మనోజ్ సినిమాలు చేయకపోవడానికి కారణం తన వ్యక్తిగత విషయమని ధనరాజ్ తెలిపారు. ఏదో ఒక ప్లాన్ లేకపోతే ఆయన ఈ విధంగా చేయారని కూడా తెలిపారు. మనోజ్ గారు బ్లాక్ బస్టర్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన రావచ్చని తెలియజేశారు. అందుచేతనే ఆయన కాస్త సమయాన్ని తీసుకుంటున్నారని తను భావిస్తున్నట్లుగా ధనరాజ్ తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Share post:

Latest