సీఎం జ‌గ‌న్ అస‌హ‌నం.. మంత్రి వ‌ర్గం మార్పు ఖాయం..?

ఏపీ అధికార పార్టీ వైసీపీలో మ‌ళ్లీ మంత్రి వ‌ర్గ‌కూర్పుపై త‌ర్జ‌న భ‌ర్జ‌న జ‌రుగుతోంది. ఇటీవ‌లే.. పీకే టీం స‌భ్యుడు.. మంత్రుల‌కు సంబంధించిన ప్రొగ్రెస్ రిపోర్టును సీఎం జ‌గ‌న్‌కు అందించిన‌ట్టు తెలిసింది. దీనిలో మంత్రులు చాలా వ‌ర‌కు మౌనంగా ఉన్నార‌ని.. వారి వ‌ల్ల ప్ర‌భుత్వానికి మైలేజీ ద‌క్క‌డం లేద‌ని.. చెప్పారు. దీంతో జ‌గ‌న్ కూడా ఆలోచ‌న‌లో ప‌డ్డారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల‌పై ప్ర‌త్యేకంగా ఆయ‌న దృష్టి పెట్టారు.

అస‌లు ఎంత మంది మంత్రులు యాక్టివ్‌గా ఉంటున్నారు? ఎంత మంది .. ప్ర‌భుత్వం త‌ర‌ఫున కౌంట‌ర్ ఇస్తున్నారు? అనే అంశాల‌పై ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నార‌ని స‌మాచారం. అయితే.. కేవ‌లం కొద్ది మంది మాత్ర‌మే జ‌గ‌న్ ఆశించిన విధంగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నార‌నేది వైసీపీ అధినేత గుర్తించిన అంశంగా ప్ర‌చారంలో ఉంది. స‌భ ప్రారంభ‌మైన ప్ప‌టికీ.. ఇంకా.. ఇద్ద‌రు నుంచి ముగ్గురు మంత్రులు అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కు స‌భ‌కు కూడా రాలేదు.

CM Jagan to give statement in the Assembly today

అదేస‌మ‌యంలో వ‌చ్చిన వారిలోనూ.. ఎవ‌రూ ప్ర‌తిప‌క్షంపై ఎక్కుపెట్టిన బాణంగా మాట్లాడిన వారు కూడా లేరు. దీంతో ప్ర‌తిదానికీ.. మాజీ మంత్రుల‌ను ప్ర‌భుత్వం బ్ర‌తిమాలుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని అంటున్నా రు. తొలిరోజు.. చంద్ర‌బాబుపై విరుచుకుప‌డే వారుఎవ‌రున్నారా? అని.. కీల‌క మంత్రులు ఎదురు చూడాల్సి వ‌చ్చిందంటే.. ప‌రిస్థితి ఎలా ఉందో అర్ధ‌మ‌వుతుంద‌ని .. వైసీపీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలోనే కొడాలి నానికి క‌బురు పంపి.. స‌బ్జెక్టు ఇచ్చి.. ఆయ‌న‌తోమాట్లాడించార‌ట‌.

AP Minister Kodali Nani on stage wise abolishion of liquor ||AP Assembly ||  Day 6 - YouTube

ఈ ప‌రిణామాల‌పై విసుగు చెందుతున్న సీఎం జ‌గ‌న్ త్వ‌ర‌లోనే మంత్రివ‌ర్గాన్ని మార్చేయడం ఖాయ‌మ ని.. ఒక కీల‌క స‌ల‌హాదారు.. వ్యాఖ్యానించేశారు. “ఉన్న‌వాళ్లు స‌రిగాలేరు. ఏం చేస్తారు“ అని ఆయ‌న న‌ర్మ గ‌ర్భంగా వ్యాఖ్య‌లు చేశారు. అంటే.. ప్ర‌స్తుతం ఉన్న మంత్రి వ‌ర్గాన్ని జ‌గ‌న్ ఖ‌చ్చితంగా మార్చుకునేందు కు ప్ర‌య‌త్నిస్తున్నార‌నేది వాస్తవంగా క‌నిపిస్తోంది. అయితే.. వీరిలో ఎంత మంది ఉంటారు? ఉండ‌రు? అనేది మాత్రం ప్ర‌శ్నగానే మారింది. దీంతో ఈ ప‌రిణామాలు.. వైసీపీలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌కు కార‌ణంగా ఉన్నాయ‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.