మహేష్ బాబు సినిమాలో చిట్టి.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతోంది. ఇక ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ నటించబోతోంది అనే వార్త బాగా వైరల్ గా మారుతోంది. ఇక మెయిన్ హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తున్నది. మొదట ఈ సినిమాలో హీరోయిన్ సంయుక్త మీనన్ నటిస్తోంది అని వార్తలు వినిపించాయి. ఇక ఆ తర్వాత మీనాక్షి చౌదరి పేరు కూడా వినిపించాయి.

Villain Woes For Mahesh-Trivikram! - Movie News
మరి ఆ తరువాత యువ హీరోయిన్ శ్రీలీలా ఆ పాత్రను తిరస్కరించింది అనే వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయి. చివరిగా నిర్మాతలు తమ సినిమాలో సెకండ్ హీరోయిన్గా ఫరియా అబ్దుల్లాను తీసుకురాబోతున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఈమె కోసం ఒక ప్రత్యేకమైన పాటను త్రివిక్రమ్ డిజైన్ చేసినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పాత్రకు కథ చాలా కీలకమైనది అని మహేష్ బాబుతో కూడా రొమాన్స్ చేసే సన్నివేశంలో నటిస్తోంది అన్నట్టుగా వార్తలు రావడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ విషయంపై డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాస్త క్లారిటీ ఇచ్చారని చెప్పవచ్చు.

Faria Abdullah naughty romance with Mahesh Babu
ఇక గతంలో కూడా సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఆదాశర్మ ను తీసుకోగ, జల్సా సినిమాలో కమలి ముఖర్జీని తీసుకున్నారు. ఇక ఇలాంటి ప్లానింగ్ తోనే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఫారియా అబ్దుల్లాను తీసుకొస్తున్నారనే వార్తలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్టుగా స్పందించడం జరిగింది. అసలు నేను అనుకున్న కథలో రెండవ హీరోయిన్ కి ఛాన్స్ లేదు. అలాంటప్పుడు ఇందులో రెండవ హీరోయిన్గా చిట్టి పేరు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు అంటూ ఆయన అసలు విషయంపై క్లారిటీ ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే ఈ సినిమాలో రెండవ హీరోయిన్ నటించే అవకాశం లేదు అని సమాచారం.