చిరంజీవి బాషా సినిమాను వదిలేయడానికి కారణం..?

కొంతమంది హీరోలు కొన్ని సినిమాలు చేద్దామనుకున్నా ఎందుకో అది ఒక్కోసారి కుదరకుండా ఉంటుంది. ఇక ఆ సినిమాలు ఇతర హీరోల చేతికి వెళ్లిపోతూ ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు ఎంత కష్టపడి తనే చేయాలని ప్రయత్నించినా కూడా సక్సెస్ రాకుండా ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన భాషా సినిమా బంపర్ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సురేష్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన భాష సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాని చిరంజీవి మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.Rajinikanth's 'Baashha' to re-release on December 11 | Tamil Movie News -  Times of Indiaఅయితే భాష సినిమా తెలుగులో విడుదల కావడానికి ముందు ఈ సినిమాని రీమిక్స్ చేయమని డైరెక్టర్ చిరంజీవిని సంప్రదించాలనుకున్నారట. సినిమా రిలీజ్ కి ముందే డైరెక్టర్ సురేష్ కృష్ణ చిరంజీవి ఏదో సినిమాలో చెన్నైకి షూటింగ్ కి రావడంతో డైరెక్టర్ చిరంజీవిని కలవడం జరిగింది. ఆ సమయంలోనే భాష సినిమా గురించి చెప్పగా తెలుగులో రీమిక్స్ చేస్తే బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందని చిరంజీవి భావించడంతో ఆ సినిమా హక్కులను ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ తీసుకోవడానికి సిద్ధమయ్యారట.Talk of the Town: Differences between Chiranjeevi & Allu Aravind?

అయితే తమిళ ప్రొడ్యూసర్ ని సంప్రదించి తెలుగు రైట్స్ అడిగేసరికి ఏకంగా ఈ సినిమాకి రూ. 40 లక్షల రూపాయలు చెప్పారట. అయితే వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితులలో ఈ అమౌంట్ పెద్ద విషయమేమీ కాదు కానీ 25 సంవత్సరాల క్రితం.. అల్లు అరవింద్ 25 లక్షల రూపాయలకి అడిగారట కానీ ప్రొడ్యూసర్ ఒప్పుకోకపోవడంతో అల్లు అరవింద్ ఆ ప్రాజెక్టును వదిలేశారు అయితే ఆ సినిమాని రజినీకాంత్ తెలుగులోనే డబ్బింగ్ చేసి విడుదల చేయగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఈ సినిమాని మిస్ చేసుకోవడంతో చిరంజీవి కెరియర్ లో ఒక బ్లాక్ బాస్టర్ సినిమా మిస్సయిందని చెప్పవచ్చు.

Share post:

Latest