రాంగోపాల్ వర్మ – చిరంజీవి, రజనీకాంత్ కాంబోలో ఆగిపోయిన సినిమా ఏంటో తెలుసా..?

ఏ సినిమా ఎవరు చేయాలనేది ఎవరికీ తెలియదు. ఒక సినిమా చర్చలు సమయంలో ఉండగా డైరెక్టర్ తన మనసులో ఈ కథకు సరిపడా నటీనటులను తన మనసులో ఫిక్స్ చేసుకుంటాడు. తర్వాత నిర్మాతను సంప్రదిస్తాడు. ఒకసారి దర్శకుడు తన మనసులో అనుకున్న నటి నటులు కొన్ని అనుకోని కారణాలవల్ల ఆ సినిమాలో చేయడానికి నిరాక‌రిస్తే మ‌రో హీరోతో చేసేస్తుంటారు. అవి హిట్లు కూడా అవుతూ ఉంటాయి.

Akkupakshi: Ramgopal Varma Vs Megastar Chiranjeevi Fans

అలాంటి సినిమానే బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన రాంగోపాల్ వర్మ ‘రంగీలా సినిమా. నిజానికి ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి – సూపర్ స్టార్ రజినీకాంత్, అతిలోకసుందరి శ్రీదేవితో తీయాల్సి ఉంది. ఇలాంటి అరుదైన కాంబినేషన్ తో సినిమా తీస్తే అవకాశం రాంగోపాల్ వర్మ వదులుకోవడం గమనార్హం. ఈ విషయాన్ని ఈటీవీలో వచ్చే ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ చెప్పారు.

ఆ టైంలోనే నాగార్జునతో శివ సినిమా తీసి ఇండస్ట్రీలోని అదిరిపోయే సూపర్ హిట్ అందుకున్నాడు రాంగోపాల్ వర్మ. శివ సినిమా చూసిన అశ్వినీ దత్ రాంగోపాల్ వర్మతో ఎలాగైనా సినిమా తీయాలనుకుని కథ వినకుండానే రాంగోపాల్ వర్మకి అడ్వాన్స్‌ ఇచ్చేశారు. అప్పుడే రాంగోపాల్ వర్మ రంగీలా, గోవిందా గోవిందా వంటి కథలు అశ్వినీద‌త్‌కు చెప్పారు.

ashwani dutt interesting comments on ali tho saradaga show details, ashwini dutt, tollywood, alitho sardaga, sridevi, rangila movie, rajinikanth, chiru, director ram gopal varma, rajini chiru sridevi combo movie, producer ashwani dutt -

కానీ అశ్విని దత్ కి గోవిందా గోవిందా కథ బాగా నచ్చింది. వర్మ రంగీలా క‌థ‌ను సినిమా చేద్దామని ఎంత చెప్పినా వినలేదు అశ్వినీ దత్. అయితే వ‌ర్మ చిరు, ర‌జ‌నీ – శ్రీదేవి కాంబోలో రంగీలా తీద్దామ‌ని చెప్పినా అశ్వ‌నీద‌త్‌కు న‌చ్చ‌లేదు. చివ‌ర‌కు గోవిందా ప్లాప్ అయితే రంగీలా సూప‌ర్ హిట్ అయ్యింది.

Share post:

Latest