సీనియర్లకు నో సీటు..బాబు తేల్చేశారు!

ఈ సారి చాలామంది సీనియర్లకు సీట్లు ఇవ్వడం కష్టమని చంద్రబాబు తేల్చి చెప్పేశారు. ఎన్నో ఏళ్లుగా టీడీపీలో పనిచేస్తూ వస్తున్న కొందరు సీనియర్లని ఈ సారి సైడ్ చేయక తప్పదని బాబు చెబుతున్నారు. సీనియర్లు ఇంకా పార్టీకి సలహాలు ఇవ్వడానికే పరిమితం కానున్నారు. ఎప్పుడైతే నారా లోకేశ్…వరుసగా ఓడిపోతున్న నేతలకు సీటు ఇవ్వడం కష్టమే అని చెప్పడం..అలాగే యువకులకు సీట్లు ఎక్కువ కేటాయిస్తాం అని చెప్పారో…అప్పటినుంచి చంద్రబాబు…నెక్స్ట్ ఎన్నికల్లో 40 సీట్లు యువతకే అని చెబుతూ వస్తున్నారు.

తాజాగా టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా బాబు ఈ విషయాన్ని మరోసారి చెప్పారు. పార్టీ బాధ్యతలను నిర్వర్తించకుండా కాడి పడేసే నాయకుల్ని మార్చడానికి వెనకాడమని చెప్పిన బాబు… ఈసారి ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే ఇస్తామని, ఇక సీటు రాని వారు తనని అపార్థం చేసుకోవద్దని తేల్చి చెప్పేశారు. అంటే చాలామంది సీనియర్ల సీట్లు పోవడం ఖాయమని తెలుస్తోంది.

ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో యువ నాయకులని ఇంచార్జ్‌లు పెట్టారు. వారు దూకుడుగానే పనిచేసుకుంటూ వస్తున్నారు. కానీ కొందరు సీనియర్లు పూర్తి యాక్టివ్ గా ఉండటం లేదు. ఏదో పార్టీ కార్యాలయాలకు వచ్చి మీడియా సమావేశం పెట్టడం వరకే పరిమితమవుతున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి పనిచేయడం లేదు. అలాంటి వారిని మొహమాటం లేకుండా పక్కన పెట్టేస్తానని బాబు చెబుతున్నారు.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది…సీనియర్లకు సీటు ఉండదు…40 శాతం సీట్లు యువతకే ఇస్తానని అన్నారు. కానీ సీనియర్ నేతలు తప్పుకుని తమ వారసులకు సీట్లు ఇప్పించుకోవడానికి రెడీ అవుతున్నారు. చంద్రబాబు సైతం కొందరు సీనియర్లు బదులు…వారి వారసులకు సీట్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఉదాహరణకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని తప్పిస్తే..ఆయన వారసుడుకు సీటు ఇచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి సీనియర్లకు బాబు హ్యాండ్ ఇవ్వడం గ్యారెంటీ అని తెలుస్తోంది.