బుగ్గనకు సుబ్బారెడ్డి టఫ్ ఫైట్?

డోన్ నియోజకవర్గం అంటే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కంచుకోట అనే సంగతి తెలిసిందే…ఇక్కడ బుగ్గనకు బలమైన ఫాలోయింగ్ ఉంది. గత రెండు ఎన్నికల్లోనూ బుగ్గన విజయం సాధిస్తూ వస్తున్నారు. 2014లో 11 వేల మెజారిటీతో గెలిస్తే…2019 లో దాదాపు 35 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత మంత్రి కూడా అయ్యారు. ఇంకా మంత్రి అయ్యాక డోన్‌లో బుగ్గనకు తిరుగులేదనే పరిస్తితి వచ్చింది. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయిందో అప్పటినుంచే డోన్‌లో సీన్ మారిపోతూ వచ్చింది.

టీడీపీలో బలమైన నాయకత్వం లేనంత వరకు ఇక్కడ వైసీపీకి తిరుగులేదనే పరిస్తితి. కానీ ఎప్పుడైతే ఇక్కడ టీడీపీ నుంచి సుబ్బారెడ్డి ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి బుగ్గన గ్రాఫ్ కాస్త తగ్గుతూ వస్తుంది. గతంలో ఇక్కడ టీడీపీకి మంచి విజయాలే దక్కాయి. అది కూడా కే‌ఈ ఫ్యామిలీ ఉన్నపుడే. కే‌ఈ ఫ్యామిలీ కాంగ్రెస్‌లో ఉండగా మంచి విజయాలు సాధించింది.

అయితే నిదానంగా ఇక్కడ కే‌ఈ ఫ్యామిలీ బలం తగ్గుతూ వచ్చింది. దీంతో ఇక్కడ టీడీపీ బలం తగ్గిపోయింది. కే‌ఈ ప్రతాప్ సైలెంట్ అవ్వడంతో కే‌ఈ ప్రభాకర్‌ని ఇంచార్జ్ గా పెట్టారు. అయినా సరే ప్రభాకర్ కూడా సరిగ్గా పనిచేయలేదు. దీంతో సుబ్బారెడ్డిని ఇంచార్జ్ గా పెట్టారు. సుబ్బారెడ్డి వచ్చిన దగ్గర నుంచి డోన్ లో టీడీపీ బలం పెరుగుతూ వస్తుంది..ఆయన దూకుడుగా పనిచేస్తూ…నిత్యం ప్రజల్లో తిరుగుతూ, కార్యకర్తలని కలుపుకునిపోతూ పనిచేయడం అడ్వాంటేజ్ అయింది.

పైగా డోన్‌లో బుగ్గన బలం తగ్గుతూ వస్తుందని సర్వేల్లో తేలింది…మంత్రిగా ఉన్నా సరే డోన్‌లో బుగ్గన చేసిన అభివృద్ధి తక్కువే అని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్తితి. ఇక తాజాగా డోన్ టీడీపీ అభ్యర్ధిగా సుబ్బారెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. అక్కడ నుంచి సుబ్బారెడ్డి ఇంకా దూకుడుతో పనిచేస్తున్నారు. ఏదేమైనా ఈ సారి ఎన్నికల్లో బుగ్గనకు సుబ్బారెడ్డి గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నారు.