బుచ్చయ్యకు ‘జనసేన’ గండం..!

గత ఎన్నికల్లో దాదాపు 50 వరకు నియోజకవర్గాల్లో ఓట్లు చీల్చి టీడీపీ ఓటమికి జనసేన కారణమైన విషయం తెలిసిందే. జనసేన గెలవలేదు..అలాగే టీడీపీని గెలవలేదు. వెరసి వైసీపీకి బెనిఫిట్ అయింది. వైసీపీ భారీ స్థాయిలో 151 సీట్లు గెలుచుకోవడానికి కారణం జనసేన ఓట్లు చీల్చడమే. అయితే ఇప్పటికీ జనసేన వల్ల టీడీపీకే నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఇబ్బంది లేదు. అలా కాకుండా విడివిడిగా పోటీ చేస్తే దాదాపు 52 స్థానాల్లో జనసేన ప్రభావం ఉంటుందని..వాటిల్లో ఓ ఐదారు స్థానాల్లో జనసేన గెలుస్తుందని, మిగిలిన స్థానాల్లో గెలుపోటములని ప్రభావితం చేస్తుందని తాజా సర్వేలో వెల్లడైంది.

అంటే జనసేన గెలవదు గాని…టీడీపీకి కూడా గెలిచే ఛాన్స్ ఇవ్వదు. దీని వల్ల టీడీపీకి మళ్ళీ భారీ నష్టమే జరిగే ఛాన్స్ ఉంది. ఇదే క్రమంలో రాజమండ్రి రూరల్ సీటులో జనసేన ప్రభావం చాలా ఎక్కువగా ఉందని తాజా సర్వేలో తెలిసింది. దాదాపు 30 శాతంపైనే ఓట్లు ఇక్కడ జనసేన రాబడుతుందని తెలుస్తోంది. అదేగాని జరిగితే టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీకి డ్యామేజ్ అయ్యేలా ఉంది.

గత రెండు ఎన్నికల్లో బుచ్చయ్య రాజమండ్రి రూరల్ నుంచి గెలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికలో జనసేన సింగిల్ గా పోటీ చేసిన సరే బుచ్చయ్య గెలుపు ఆగలేదు. 10 వేల పైనే ఓట్లతో వైసీపీపై గెలిచారు. అయ్తితే ఆ ఎన్నికల్లోనే జనసేన 22 శాతంతో 42 వేల ఓట్లు తెచ్చుకుంది. అప్పుడే జనసేన బలం బాగానే ఉంది.

ఇక ఈ బలం ఇప్పుడు మరింత పెరిగిందని సర్వేల్లో తెలుస్తోంది. దాదాపు 30 శాతం  పైనే ఓట్లు వస్తాయని చెబుతున్నారు. అంటే అప్పుడు బుచ్చయ్యకు దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పొత్తు ఉంటే రిస్క్ ఉండదు..లేదంటే బుచ్చయ్య గెలుపు డౌటే.