ఇదేం ట్విస్టురా బాబు… బ్ర‌హ్మాస్త ఈవెంట్ ర‌ద్దుతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబ‌రాలు…!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి సమర్పణలో వ‌స్తున్న‌ బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర. ఇందులో రణ‌బీర్‌కపూర్, అలియా భట్ అమితాబచ్చన్, నాగార్జున వంటి దిగ్గజ నటులు నటించారు. బాలీవుడ్ దిగ్గ‌జ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబర్9న‌ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల‌ అవుతుంది. చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ లో చాలా స్పీడ్ గా చేస్తున్నారు. ఈ రోజు హైదరాబాదులో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.

Ranbir Kapoor, Alia Bhatt's 'Brahamastra' pre-release event in Hyderabad  cancelled, fans upset

తాజాగా ఈ ఈవెంట్ ఆగిపోయిందని చిత్ర యూనిట్ తెలియజేసింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరు కాబోతున్నట్లుగా చిత్ర యూనిట్ మొదట తెలిపారు. దీంతో ఎన్టీఆర్ అభిమ‌నులు భారీగా హాజరవుగా చివర నిమిషంలో ఈ కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేయడం ఫ్యాన్స్ చాలా నిరాశకు గురయ్యారు. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంద‌రు ఎన్టీఆర్‌ను ఈవెంట్‌కు రావ‌ద్దొ అంటూ ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ ఈవెంట్ క్యాన్సిల్ అవటంతో వారు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Jr NTR For Brahmastra! Ranbir Kapoor & Team Are Creating History By Signing  Blockbuster Stars For Their Promotions

దీనికి కారణం ఏమిటంటే ఇది బాలీవుడ్ సినిమా కావటం కరణ్‌ జోహార్ వంటి నిర్మాత సినిమా నిర్మించడం. కర‌ణ్‌ జోహార్ నిర్మించిన సినిమాలన్నీ ప్రస్తుతం బాయికాట్ ట్రెండ్ కు గురు అవుతున్నాయి. కానీ ఫ్యాన్స్ చాలామందికి ఎన్టీఆర్ ఈవెంట్ కు వెళ్ళటం ఇష్టం లేదు. ఇప్పుడు ఈ ఈవెంట్ ఆగిపోవడంతో వారు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest