కృష్ణంరాజు కూతుర్లు అసలు ఏం చేస్తుంటారో తెలుసా..?

కుటుంబ సభ్యులు , అభిమానులు మధ్య రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు మొన్నటి రోజున ముగిశాయి. మోయినాబాద్ లోని కనక మామిడి ఫామ్ హౌస్ లో ప్రభుత్వ లాంఛనాలు మధ్య కృష్ణంరాజుకు అంతిమ వీడ్కోలు పలికారు. ఇక అక్కడికి ఎంతోమంది సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, అభిమానులు కూడా ఆ ఫామ్ హౌస్ కి తరలివచ్చారు. కృష్ణంరాజు హఠాత్ మరణంతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా విషాదంలోకి వెళ్లిపోయింది. ఇదంతా ఇలా ఉంటే కృష్ణంరాజుకు ముగ్గురు ఆడపిల్లలనే విషయం అందరికీ తెలిసిందే. వారిలో ఇంకా ఎవరికీ వివాహం కాలేదు.

Krishnam Raju daughter Praseedha entry with Prabhas Radhe Shyam
వారి వివాహం చూడకుండానే కృష్ణంరాజు కన్నుమూయడం తీవ్రంగా అభిమానులను కలచివేస్తోంది. సినీ నేపథ్యం కుటుంబంలో జన్మించిన వారు ఎక్కువగా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి తప్ప ఎలాంటి సినిమా ఈవెంట్లో అంతగా కనిపించరు. ఇక వారి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక కృష్ణంరాజు కుమార్తెలు మీడియా వద్దకు వచ్చింది కూడా చాలా తక్కువ తాజాగా ఆయన మరణంతో కృష్ణంరాజు ముగ్గురు కూతుర్లు ఏం చేస్తుంటారు అనే ప్రశ్న అభిమానులలో మొదలైంది.. వాటి గురించి చూద్దాం.

Krishnam Raju Dies At 82 Know About Krishnam Raju Family Life First Wife  Second Wife Children | Krishnam Raju First Wife : కృష్ణంరాజు మొదటి భార్య  ఎవరు? ఆవిడ ఎలా మరణించారు?
కృష్ణంరాజుకు ముగ్గురు కూతుర్లలో పెద్ద కుమార్తె ప్రసీద రీసెంట్గా లండన్ లో ఎంబీఏ పూర్తి చేసింది. అంతేకాదు ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో ఆమె నిర్మాతగా సినీ రంగం లోకి ప్రవేశం కూడా చేసింది. ఇక రెండో కుమార్తె ప్రకీర్తి హైదరాబాదులో జేఎన్టీయూ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ గా చదువుతున్నది. మూడు కుమార్తె ప్రదీప్తి సైకాలజీలో డిగ్రీ చదువుతున్నది. అయితే ఈ ముగ్గురు లో ఎవరికి కూడా కృష్ణంరాజు పెళ్లి చేయకుండానే మృతి చెందారు. ఇక వీరితోపాటు ఎంతో ఇష్టపడే ప్రభాస్ వివాహం కూడా చూడకుండానే ఆయన మరణించడం అభిమానులకు తీవ్రంగా కలచివేస్తోంది.

Share post:

Latest