కృష్ణంరాజుతో ఉన్న స్నేహ బంధాన్ని తెలిపిన బాలయ్య..!!

నటుడు కృష్ణంరాజు మృతి పట్ల సినీ ప్రముఖులు అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ హీరోలు ఆయనతో తమ యొక్క అనుబంధాన్ని మరియు అనుభవాలను షేర్ చేస్తూ ఉన్నారు. అలా చిరంజీవి మా ఊరి హీరో అంటూ సోషల్ మీడియా ద్వారా కృష్ణంరాజుతో ఉన్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేసి ఎమోషనల్ అయ్యారు. ఇక నందమూరి బాలకృష్ణ కూడా NBK -107 సినిమా షూటింగ్లో భాగంగా టర్కీలో జరుగుతున్న కారణంగా నేరుగా కృష్ణంరాజు పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు సాధ్యపడకపోవడంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి చిత్ర యూనిట్ తో సహా నివాళులర్పించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కూడా బాలకృష్ణ కృష్ణంరాజు పైన ఉండే ప్రేమను చూపించారు.

Nandamuri Balakrishna: కృష్ణం రాజు మరణవార్త విని దిగ్భ్రాంతికి గురైన  బాలయ్య.. టర్కీ నుంచే నివాళి | Nandamuri Balakrishna Pays Tribute to  Krishnam Raju From Turkey Telugu News | TV9 Telugu

ఇక అంతే కాకుండా కృష్ణంరాజుతో గల స్నేహ బంధాన్ని వివరిస్తూ ఒక ఫోటోను కూడా తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడం జరిగింది. శ్రీకృష్ణం రాజు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసిందని.. మన సినీ రంగానికి పెద్దదిక్కు కోల్పోయామని ఈరోజు తనదైన నటన శైలితో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొని రెబల్ స్టార్ గా నిలిచారని.. అంతేకాకుండా లోక్ సభ సభ్యుడుగా కూడా ఆయన అందించిన సేవలు మరిచిపోనివి అని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నా ప్రగడ సానుభూతిని తెలియజేస్తున్నానని జోహార్ రెబల్ స్టార్ అంటూ ఒక పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటో కాస్త వైరల్ గా మారుతోంది.

Nandamuri Balakrishna condolence on Krishnam Raju Death | కృష్ణంరాజుతో  మర్చిపోలేని అనుభవం.. రేర్ పిక్ పంచుకుంటూ బాలకృష్ణ ఎమోషనల్– News18 Telugu

బాలకృష్ణ నటించిన సుల్తాన్ చిత్రంలో కృష్ణంరాజు కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. అందులోనే సూపర్ స్టార్ కృష్ణ కూడా నటించారు.ఆ సినిమా సమయంలోనే బాలయ్యకి కృష్ణంరాజుకి మంచి స్నేహబంధం ఏర్పడిందట. అలా కృష్ణ కి ఈ సినిమాతోనే కృష్ణంరాజు మంచి స్నేహితుడయ్యాడట. అలా కృష్ణ కృష్ణంరాజు ఇంటికి వెళ్లి కృష్ణ నివాళులు అర్పించారు.

Share post:

Latest