బాలయ్య అలాంటి వ్యక్తే.. అంటే షాకింగ్ కామెంట్స్ చేసిన ఇంద్రజ..!!

వెండితెరపై.. బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న హీరోయిన్లలో నటి ఇంద్రజ కూడా ఒకరు. ఇంద్రజ.. బాలకృష్ణ , మోహన్ లాల్ , కృష్ణ, రాజేంద్రప్రసాద్, ఆలీ వంటి హీరోలతో కూడా నటించింది. యమలీల సినిమాకు మొదటిసారిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంద్రజ ఆ తర్వాత 90 సినిమాలలో పైగా నటించింది. ప్రస్తుతం పలు షో లలో బుల్లితెరపై కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటుంది. అయితే తాజాగా బాలకృష్ణ పై తనకున్న అభిప్రాయాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Peddannayya Movie || O Mustafa Nee Muddabanthi Video Song || Balakrishna,  Indraja, Roja - YouTube

ఇంద్రజ మాట్లాడుతూ.. తనకు సంగీతం, డాన్స్ అంటే చాలా ఇష్టం.. అది తన రక్తంలోనే ఉన్నది అని తెలియజేసింది. తన తల్లి కూడా ఒక డాన్సర్ అవ్వడం చేత తను కూడా తన తల్లితోపాటు భరతనాట్యం నేర్చుకున్నానని తెలియజేసింది. ఇక తర్వాత సినిమా అవకాశాలు ఎలా వచ్చాయి అనే ప్రశ్న అడగగా.. మొదట జంతర్ మంతర్ అనే సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా ఎస్ వి కృష్ణారెడ్డి గారు సెట్లోకి వచ్చారట.. ఆ సమయంలోనే తనను చూసి యమలీల సినిమాకు తనని హీరోయిన్గా ఎంపిక చేశారని తెలిపింది ఇంద్రజ.

I Second Your Opinion on Nandamuri Balakrishna - Indraja
అలా హీరోయిన్ గా పరిచయమైన ఈమె కేవలం రెండు సంవత్సరాల్లోనే 30కు పైగా సినిమాలలో నటించానని తెలిపింది. అయితే అది ఎలా సాధ్యపడిందో ఇప్పటికీ కూడా అర్థం కాలేదని తెలిపింది ఇంద్రజ. తనతో నటించిన ప్రతి ఒక్క హీరోల శైలి, ప్రత్యేకత ఉండే విధానం వారితో కలిసిపోయే తీరు తనని బాగా ఆకట్టుకుంటూ ఉండేదని తెలియజేసింది. అలా వారి దగ్గర నుంచి చాలానే నేర్చుకున్నాను అని తెలిపింది. రాజేంద్రప్రసాద్ ఎలా నటించాలో నేర్పించారని.. ఇక ఆలీ కూడా సినిమాలలో ఉన్నట్టుగా బయట ఉండరని చాలా ప్రశాంతంగా ఉంటారని తెలిపింది. తమిళంలో కూడా కొన్ని సినిమాలలో నటించానని తెలిపింది.

బాలకృష్ణతో పెద్దన్నయ్య, లయన్ సినిమాలలో నటించాను.. షూటింగ్ సెట్ లో బాలయ్యను చూసి చిన్నపిల్లల మనస్తత్వం అనుకున్నానని ఇదే విషయం ఎవరైనా చెబుతారా.. మనసులో ఒకటి నాలుకపై మరొకటి ఉండకూడదు.. ప్రేమగా చూసుకుంటారు అందుచేతనే బాలయ్య బాబుకు అంత క్రేజ్ ఉందని తెలియజేసింది. ఒక మంచి వ్యక్తి అని కూడా తెలిపింది.

Share post:

Latest