కనీసం శ్రీముఖి తోనైనా గాడ్ ఫాదర్ కి కలిసొచ్చేనా..?

చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. దాదాపుగా ఈ సినిమా ఇప్పటికీ రూ.200 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిత్ర బృందం మాత్రం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో అభిమానుల సైతం తీవ్ర ఆందోళన చేపడుతున్నారు. కనీసం ఈ సినిమా విడుదలకు రెండు వారాలు కూడా లేకున్నా ప్రమోషన్ కార్యక్రమాలను మాత్రం మొదలు పెట్టకపోవడంతో అసలు ఏం జరుగుతోందనే విషయం అర్థం కావడం లేదని అభిమానుల సైతం భావిస్తున్నారు

GodFather Teaser: Chiranjeevi And Salman Are Partner In Crimes - video  Dailymotion
ఇక ఈ సమయంలోనే చిరంజీవి సినిమా ప్రమోషన్స్ పనులు మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. అది కూడా ఏకంగా ఆకాశంలో ఒక జెట్ విమానంలో సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. అందులో యాంకర్ శ్రీముఖి మరియు చిరంజీవి మధ్య సరదా సంభాషణలతో గాడ్ ఫాదర్ సినిమా యొక్క కార్యక్రమాలను మొదలుపెట్టడం జరిగింది. అందుకు సంబంధించి చిత్ర బృందం అధికారికంగా ఒక ప్రమోషన్ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టారు. ఇక మెగా ఫ్యాన్స్ దీంతో కాస్త సంబరపడిపోతున్నారని చెప్పవచ్చు ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్, సునీల్, పూరి జగన్నాథ్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.

దీంతో నయనతార కూడా ప్రమోషన్లలో పాల్గొనేందుకు అవకాశం ఉన్నట్లుగా కొంతమంది భావిస్తున్నారు. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్గా రీమిక్స్ చేయడం జరిగింది. తాజాగా విమానంలో చిరంజీవి ఇంటర్వ్యూ చేసిన శ్రీముఖి అతి త్వరలోనే ఆ పూర్తి వీడియో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ లో ఒక వీడియో వైరల్ గా మారుతోంది.

Share post:

Latest