అరవింద్ స్వామి జీవితంలో పడ్డ కష్టాల గురించి తెలిస్తే.. కన్నీళ్లు రావడం ఖాయం.. 

అందం, విలక్షణమైన చిరునవ్వుతో ఆకట్టుకొనే నటుడు అరవింద్ స్వామి.. మోడల్ గా, టీవీ వ్యాఖ్యతగా, నటుడిగా ప్రసిద్ధి చెందారు. ఇక అమ్మాయిల్లో అరవింద్ స్వామికి మంచి క్రేజ్.. ఆయన్ను చూడగానే ఎంతో మంది ముద్దుగుమ్మలు మనసు పారేసుకున్నారు. అరంవిద్ స్వామి చదువుకునే సమయంలోనే యాడ్ ఫిలిమ్స్ చేశారు. ఆ యాడ్స్ లో చూసిన మణిరత్నం ‘దళపతి’ సినిమాలో కీలక పాత్రకు ఎంచుకున్నారు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోనే వచ్చిన ‘రోజా’ సినిమాతో హీరో అయిపోయారు. ఆ సినిమా తెలుగు, హిందీ భాషల్లో కూడా భారీ హిట్ అందుకుంది. ఆ తర్వాత మణిరత్నం రూపొందించిన ‘బొంబాయి’ సినిమా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విశేషంగా మురిపించింది. ఆ సినిమాతో అరవింద్ స్వామికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది..

ఇక అరవింద్ స్వామి వ్యక్తిగత విషయానికి వస్తే.. 1994లో ఆయన గాయత్రీ రామమూర్తిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. అరవింద్ స్వామి తండ్రి వి.డి.స్వామి తమిళనాడులో ఓ పెద్ద వ్యాపారవేత్త.. పెళ్లి తర్వాత అరవింద్ ఒకవైపు తండ్రి వ్యాపారం చూసుకుంటూ.. మరోవైపు సినిమాలు చేస్తూ వచ్చారు. ఆ సమయంలో ఆయన భార్య అరంవిద్ స్వామిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. దీంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.

2010లో అరవింద్ స్వామి భార్యతో విడాకులు తీసుకున్నారు. అయితే పిల్లల సంరక్షణ మాత్రం కోర్టు అరవింద్ స్వామికే అప్పగించింది. అప్పటి నుంచి పిల్లలకు అన్ని తానై వారికి కావాల్సినవన్నీ సమకూర్చేవారు.. అయితే ఒకసారి ఆయనకు యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో ఆయన వెన్నుముకకు గాయం అయ్యింది. దీంతో కొంత కాలం కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్నారు.

ఆ తర్వాత తనను, తన పిల్లలను చూసుకోవడానికి అపర్ణా ముఖర్జీని అరవింద్ స్వామి పెళ్లి చేసుకున్నారు. తన మొదటి భార్య తనను అర్థం చేసుకోలేకపోయినందుకు మానసికంగా ఎంతో బాధపడేవాడు.. ఇక పిల్లల విషయంలో మాత్రం వారికి స్వేచ్ఛ ఇచ్చారు. వారికి నచ్చిన విధంగా ఉంటున్నారు. వారి విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోరు. పిల్లలు ఏదైనా విషయంలో సలహా అడిగితేనే చెబుతారట.. అయితే వారికి కావాలసినన్నీ సమకూరుస్తూ వస్తున్నారు..

Share post:

Latest