ఒక్కటి కాదు, అవసరమైతే 100 ముద్దులు ఇస్తానంటున్న యాంకర్… ఎవరికో తెలుసా? 

అవును, మీరు విన్నది నిజమే. ఆ యాంకర్ ఒక్కటి కాదు, అవసరమైతే 100 ముద్దులు ఇస్తానంటోంది. ఎవరికో తెలిస్తే అవాక్కవుతారు. అతనే పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్. అవును… పవన్ కళ్యాణ్ ఎదురుగా వ‌స్తే 100 ముద్దులు పెడ‌తా అంటోంది న‌టి సురేఖా వాణి. ఆమె గురించి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తెలియ‌ని వారు ఉండ‌రు. త‌ల్లిగా, చెల్లిగా, అక్క‌గా, వ‌దిన‌గా, స్నేహితురాలిగా ఇలా ఎన్నో గుర్తుండిపోయే పాత్ర‌ల్లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఈ మ‌ధ్య సినిమాల్లో జోరు త‌గ్గించినా సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్నారు. ముఖ్యంగా కూతురు సుప్రితతో కలిసి ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదు.

సుప్రితతో కలిసి లైఫ్​ను సరదాగా గడుపుతూ వాటికి సంబంధించిన పోస్ట్​లను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నారు. తామిద్దరివి హాట్ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా వీడియోలు కూడా షేర్ చేస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం సురేఖ భర్త మరణించిన విషయం తెలిసిందే. ఇక తర్వలోనే రెండో పెళ్లి చేసుకుంటుందనే వార్తలు కూడా వాచ్చాయి. కానీ ఆమె మాత్రం ఇంతవరకు ఎవరిని రెండో వివాహం చేసుకోలేదు. కూతురు సుప్రీతతోనే కలిసి సింగిల్​గా జీవిస్తున్నారు.

అయితే తాజాగా సురేఖ వాణికి చెందిన ఓ పాత ఇంటర్వ్యూ బయటకు వచ్చింది. అందులో ఆమె మెగాకుటుంబంపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. చిరంజీవికి తాను అభిమాని అని, పవర్​స్టార్ పవన్​కల్యాణ్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. అంతేకాదు పవన్ ఎదురుగా కనిపిస్తే వెంటనే 100 ముద్దులు ఇస్తాను అంటూ బోల్డ్​ కామెంట్​ కూడా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇకపోతే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. రెండో పెళ్లికి తాను దూరం అని చెప్పింది. కానీ బాయ్ ఫ్రెండ్ కావాలంటూ.. కొన్ని క్వాలిటీస్​ను కూడా చెప్పింది.

Share post:

Latest