పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ ప్రదీప్..!!

బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ఇక నటుడుగా కూడా కొన్ని సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం ప్రదీప్ హోస్ట్ చేస్తున్నటువంటి షోల సంఖ్య తగ్గినప్పటికీ అభిమానించే అభిమానులు మాత్రం పెరుగుతూనే ఉన్నాదని చెప్పవచ్చు. యాంకర్ ప్రదీప్ పెళ్లి గురించి ఇప్పటికి ఎన్నో వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా యాంకర్ ప్రదీప్ పెళ్లి పై.. పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు వాటి గురించి తెలుసుకుందాం.

Finally, Pradeep reveals what happened to him
గతంలో యాంకర్ ప్రదీప్ పెళ్లి అయిపోయింది అని పలు యూట్యూబ్ ఛానల్ లో వార్తలు ప్రచారం అయితే జరిగాయి.ఇక ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ఇలాంటి వార్తలపై ప్రదీప్ స్పందిస్తూ.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఇప్పటికే నాకు నాలుగైదు సార్లు వివాహం అయిపోయిందని కామెంట్లు కూడా చేశారు.. నా పెళ్లి గురించి యూట్యూబ్లో చూడలేదా నువ్వు అంటు ప్రదీప్ తనపైన తాను సెటైర్లు వేసుకోవడం జరుగుతుంది.. మీ ఊత పదం ఏంటి అని ప్రశ్న యాంకర్ అడగగా.. నీ యంకమ్మా అని సమాధానం ఇచ్చారు.

ప్రదీప్ మాచిరాజు వెల్లడించిన ఈ వార్తలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.. ప్రదీప్ పెళ్లి పై ఆయన అభిమానులు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక వీరే కాకుండా సినీ ఇండస్ట్రీలో ఉండే కొంతమంది ప్రముఖులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే గతంలో ప్రదీప్ పైన పలు రూమర్స్ కూడా రావడం జరిగింది.. కానీ వాటన్నిటిని కొట్టిపారేసాడు ప్రదీప్. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించిన ప్రదీప్ ఆ తర్వాత మరే సినిమాలో నటించలేదు కేవలం యాంకర్ గానే ప్రదీప్ కొనసాగుతూ ఉన్నారు.

Share post:

Latest