టబు – నాగార్జున ఎఫైర్‌పై అమ‌ల మ‌న‌సులో మాట ఇదే…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో అక్కినేని నాగార్జునకు మన్మధుడిగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రేక్షకుల్లో ఉంది. అంతేకాకుండా కింగ్ నాగార్జున నటించిన సినిమాలన్నీ మంచి సక్సెస్ ను అందుకున్నాయి. అయితే ఇక మరికొద్ది రోజుల్లో కింగ్ నాగార్జున `ది ఘోస్ట్` సినిమాతో సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.. ఇక వచ్చే నెల 5వ తేదీన థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అల‌రించ‌బోతుంది. ఇక ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే గతంలో కింగ్ నాగార్జున.. టబు ఎఫైర్‌పై వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా ప్రముఖ హీరోయిన్ టబు కింగ్ నాగార్జునకు ఎఫైర్ ఉందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. నాగార్జున – కృష్ణవంశీ కాంబినేష‌న్ లో వచ్చిన `నిన్న పెళ్లాడుతా` సినిమాలో పండుగా అదే మహాలక్ష్మి అనే పాత్ర చేసి అప్పట్లో కుర్ర కారు హృదయాల్లో గిలిగింతలు పెట్టేసింది. తర్వాత అదే నాగార్జునతో ఈవీవీ దర్శకత్వంలో వచ్చిన ఆవిడ మా ఆవిడే` సినిమాకు కూడా టబుకు మంచి క్రేజ్ వచ్చింది.

అయితే ఇక‌ అంతకంటే ముందు నుంచే నాగార్జునతో టబుకు ఘాటు ఎఫైర్ ఉందని అంటారు. అందుకే వారిద్దరూ కలిసి సినిమాలు చేశారన్న ప్రచారం కూడా జరిగింది. అసలు నాగార్జున కోసమే టబు ఇంకా పెళ్లి చేసుకోలేదని కూడా అంటారు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి సినిమాల్లో నటించడం ఆ సినిమాలు కమర్షియల్ గా కూడా సక్సెస్ కావడం అందుకే ఇలాంటి వార్తలు వైరల్ కావడం జరుగుతుంది అని కూడా అంటారు. అయితే నాగార్జున టబు ఈ వార్తలపై పెద్దగా ఎప్పుడూ స్పందించలేదు.

అయితే ఇదిలా ఉంటే తాజాగా అమల ఈ వార్తల‌కి స్పందించి తనదైన రీతిలో క్లారిటీ ఇచ్చారు. `ఓకే ఒక జీవితం` సినిమాతో అమల శర్వానంద్ తల్లి పాత్రలో నటించి అందరితో ప్రశంసలు అందుకుంది. ఇక నాగ్ – ట‌బు ఎఫైర్ గురించి మాట్లాడుతూ టాబు నా భర్తకు, నాకు మంచి ఫ్రెండ్ అంతే.. నాగార్జున టబు మధ్య మంచి ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది. అంతకుమించి వాళ్ళిద్దరి మధ్య ఏం ఎఫైర్ లాంటివి ఏం లేవని అమల అందరికీ తెలిపారు. అంతేకాకుండా మా కుటుంబ సభ్యులందరు సంతోషంగా ఉన్నాం.. మీరేం బాధపడాల్సిన అవసరం లేదని కూడా ఆమె అన్నారు.

Share post:

Latest