స్టైలిష్ స్టార్ ఇంటి గుట్టు చెప్పేశాడు.. 100 కోట్లపై క్లారిటీ ఇచ్చాడు..!

అప్పట్లో స్టైలిష్ స్టార్ బన్ని అత్యంత ఖరీదైన ఇల్లు నిర్మించుకొని తన భార్య పిల్లలతో ఆ ఇంట్లో కొత్తగా ఫ్యామిలీ పెట్టాడు అంటూ వార్తలు తెగ పరుగులు పెట్టాయి.. అయితే అది తూచ్ అని తేలిపోయింది. కానీ అప్పుడే ఆ ఇంటికి 20 నుండి 30 కోట్ల వరకు మన దేశముదురు ఖర్చు పెడుతున్నాడంటే అందరికి ఆశ్చర్యం వేసింది. అయితే అప్పుడు ఆర్యకు ఆ మొత్తం ఎక్కువే అయితాయన్న వార్తలు వచ్చినా ఇప్పుడు అది తక్కువే అవుతుందనిపిస్తుంది.

ఎందుకంటే తన పరుగుతో మొదలెట్టిన డీజే.. ఇప్పుడు వందల కోట్ల పారితోషికంతో రేస్ గుర్రంలా దూసుకుపోతున్నాడు.. పుష్పతో పాన్ ఇండియా స్థాయిలో దంచికొడుతున్నాడు.. రేంజ్ మరినప్పుడు ఇళ్లు చిన్నదైతే ఎలా మరీ… అందుకే టాలివుట్ లో ఏ హీరోకు లేని విధంగా అలా ఆలోచించి ఓ వైకుంఠపురాన్ని నిర్మించే యోచన చేసినట్లు తెలుస్తుంది.

ఇందుకోసం బన్నీ ఏకంగా 100 కోట్ల రూపాయలతో ఇల్లు నిర్మిస్తున్నట్లు.. గత మూడు నాలుగు నెలలుగా మీడియాలో జులాయి వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నా… అల్లు వర్గాల నుండి ఎటు వంటి సమాచారం బయటకు రాలేదు.

అయితే ఎట్టకేలకు సరైనోడు సుతిమెత్తగా నోరు విప్పాడు.. ఇటీవల కృష్ణంరాజు మృతి చెందిన సమయంలో ఆయనకు సంతాపం తెలియజేసేందుకు కృష్ణంరాజు ఇంటికి వెళ్లినప్పుడు ఇంటి గుట్టు విప్పాడు. కృష్ణంరాజు గారి ఇంటి పక్కనే తాను ఇల్లు నిర్మించుకుంటున్నట్లు.. ఓ సంవత్సరం తర్వాత ఇల్లు పూర్తి అవ్వబోతుందని., ఇల్లు పూర్తి అయిన తర్వాత కృష్ణంరాజు కుటుంబ సభ్యులను తన ఇంటికి భోజనానికి పిలవాలని అనుకున్నానానని.. ఇంతలోనే ఇలా జరిగిందని కన్నీళ్లు పెట్టుకుంటూ మీడియా ముందు వెళ్లడించాడు.

ఇంటి గురించి బన్ని బయట పెట్టడంతో ఆ ఇల్లు 100 కోట్ల ఇల్లే అంటూ ప్రచారం మొదలైంది. టాలీవుడ్ లోనే ఏ ఒక్క హీరోకి 100 కోట్ల రూపాయల ఇల్లు లేదని.. అందుకే ఆ ఇంటితో టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోగా అల్లు అర్జున్ నిలవబోతున్నాడు జోరుగా సినీ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

Share post:

Latest