ఐశ్వర్య రాయ్, త్రిషలకి ఆ విషయంలో మణిరత్నం వార్నింగ్ ఇచ్చారట!

ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా హడావుడే కనబడుతోంది. ఎందుకంటే మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుంది. తమిళంతో పాటు సౌత్ లో అన్ని భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో తమిళంతో పాటు హిందీ, తెలుగులో ఈ సినిమా భారీ వసూళ్లను సొంతం చేసుకుంటుందని చిత్ర యూనిట్ గట్టి నమ్మకంతో వుంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ లు మరియు ఇంటర్వ్యూలను మణిరత్నం ఆధ్వర్యంలో చిత్ర యూనిట్ సభ్యులు నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు.

విక్రమ్, కార్తీ, జయం రవి సహా త్రిష మరియు ఐశ్వర్య రాయ్ లతో పాటు ఇతర టెక్నీషియన్స్ సినిమా యొక్క ప్రమోషనల్ ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మణిరత్నం మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా ఈ వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. ఐశ్వర్య రాయ్ మరియు త్రిషల మధ్య సన్నివేశాల చిత్రీకరణ సమయంలో చాలా సమస్య ఏర్పడిందని, ఇద్దరు కూడా చాలా సీరియస్ రోల్స్ చేస్తున్నారు. వారు ఎదురు పడ్డ సమయంలో వారిని మాట్లాడుకోకుండా చేయడానికి కాస్త కష్టం అయ్యింది.

ఎందుకంటే వారిద్దరి మధ్య సన్నివేశాల్లో చాలా సీరియస్ నెస్ ను కల్పించేందుకే మేము ఆ ప్లాన్ వేసాం. షూటింగ్ జరుగుతున్న సమయంలో వారిద్దరిని కలవనివ్వలేదు. ఇద్దరూ కూడా షూటింగ్ పూర్తి అయ్యే వరకు కలవకూడదు అని వార్నింగ్ ఇచ్చాను అని చెప్పుకొచ్చాడు. అందువలనే సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా అద్భుతంగా వచ్చింది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. వెయ్యి కోట్ల వసూళ్లు లక్ష్యంగా ఈ సినిమా విడుదల కాబోతుంది.

Share post:

Latest