ఆ మంత్రులు అవుట్..జగన్ ఫిక్స్..?

జగన్ అధికారంలోకి వచ్చాక కేవలం రెండుసార్లు మాత్రమే మంత్రివర్గ విస్తరణ చేద్దామని అనుకున్నారు…కానీ పరిస్తితులు అలా లేవు..సమయాన్ని బట్టి మంత్రివర్గంలో మార్పులు చేయాల్సిన పరిస్తితి కనిపిస్తోంది..అధికారంలోకి రాగానే ఒకేసారి 25 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని..అప్పుడు అవకాశాలు రానివారికి మళ్ళీ రెండున్నర ఏళ్లలో అవకాశం ఇస్తానని చెప్పారు. అయితే మధ్యలోనే ఒకసారి చిన్న మార్పు చేయాల్సి వచ్చింది.

అది కూడా మండలి రద్దు నేపథ్యంలో ఎమ్మెల్సీ నుంచి మంత్రి అయిన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లని తప్పించి వారి ప్లేస్‌లో చెల్లుబోయిన వేణుగోపాల్, సీదిరి అప్పలరాజులని తీసుకున్నారు. ఇక చెప్పిన గడువు ప్రకారం మరొకసారి మంత్రివర్గంలో మార్పులు చేశారు. ఈ సారి 14 మందిని పక్కన పెట్టి, 11 మందిని అలాగే ఉంచి..కొత్తగా 14 మందిని మంత్రివర్గంలో తీసుకున్నారు. ఇక ఇదే చివరి మార్పు అని అంతా అనుకున్నారు. కానీ ఈ మధ్య మంత్రివర్గ సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలతో మళ్ళీ మంత్రివర్గంలో మార్పులు గురించి చర్చ మొదలైంది.

ప్రతిపక్ష టీడీపీని సరిగ్గా తిట్టని మంత్రులని పక్కన పెట్టేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో ఓ అయిదుగురుని పక్కన పెట్టేసి కొడాలి నాని లాంటి వారిని మళ్ళీ మంత్రివర్గంలో తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే రాయలసీమలో ఇద్దరు మంత్రులు..అసలు గళం విప్పడం లేదని, ఏదో పేరుకు మాత్రమే మంత్రులుగా ఉన్నారని వారిని ఖచ్చితంగా పక్కన పెట్టేసి..వారి స్థానాల్లో వేరే వారిని తీసుకొస్తారని తెలుస్తోంది.

ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఓ మంత్రిని సైతం తప్పించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఒక మంత్రిని కూడా తప్పిస్తారని తెలుస్తోంది. ఏ ఏ ప్రాంతాల నుంచి తప్పిస్తారో..ఆయా ప్రాంతాల నుంచే కొత్తవారికి ఛాన్స్ ఇస్తారని తెలిసింది. అలాగే ఒక మహిళా మంత్రిని తప్పిస్తారని, ఆమె ప్లేస్‌లో మరొకరికి ఛాన్స్ ఇస్తారని, నవంబర్ నెలాఖరికి ఈ ప్రక్రియ జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు జరుగుతుందో చూడాలి.