సినిమా పరిశ్రమలో ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న స్టార్స్ హీరోల లిస్ట్ ఇదే!

సాధారణ ప్రేక్షకుడికి సినిమా ప్రపంచం అనేది దూరపు కొండలు నునుపు లెక్క. సినిమాలలో కనిపించినట్టే నటీనటులు వుంటారు అని పొరబడుతూ ఉంటాం. కానీ వారు కూడా మనుషులే. ఎవరి పర్సనల్ లైఫ్ వారికుంటుంది. ఓ రకంగా చెప్పాలంటే ఓ సాధారణ పౌరుడు జీవించేంత స్వేశ్చగా వారు జీవించలేరు. ముఖ్యంగా కొంతమంది సూపర్ స్టార్స్ అనేబడేవారి పర్సనల్ లైఫ్ ని ఒకసారి చూస్తే అనేక ఒడిదుడుకులు మనకి కనిపిస్తాయి. వారి జీవితంలో ఓ వ్యక్తిని చూడడం, పరిచయం ఏర్పడడం, అభిప్రాయాలు కలిసి ఒకటిగా అవ్వడం, తరువాత మనస్పర్ధలు వచ్చి విడిపోవడం అనేది ఇక్కడ చాలా కామన్ గా కనబడుతుంది.

అలాంటి స్టార్స్ ని తీసుకుంటే ముందుగా అక్కినేని నాగార్జున గురించి చెప్పుకోవాలి. ఇతను 1984లో డా.డి.రామానాయుడు కుమార్తె లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఇక వీరికి పుట్టినవాడే నాగచైతన్య అని అందరికీ తెలుసు. 6 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత 1990లో ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత నాగార్జున, అమలను వివాహం చేసుకొని సెటిలైపోయాడు. ఇక ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలి. ఇతగాడు నందినితో 2007లో విడాకులు తీసుకుని ఆ తర్వాత 2009లో రేణు దేశాయ్ ను పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత వీళ్ళు 2012లో విడిపోవడం జరిగింది. ఆ తరువాత పవన్ తీన్మార్ సినిమాలో నటించిన ‘అన్నా లెజోనోవా’ను మూడవ వివాహం చేసుకున్నారు.

ఆ తరువాత సీనియర్ నటి రాధిక గురించి మాట్లాడుకువాలి. 1985లో నటుడు ప్రతాప్ పోతన్ ను వివాహం చేసుకొని, 1986లోనే విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తరువాత 1990లో రిచర్డ్ హార్డేను వివాహం చేసుకొని, తర్వాత విడాకులు ఇచ్చి 2001లో నటుడు శరత్ కుమార్ ను వివాహం చేసుకొని సెటిలై పోయింది. హీరో సుమంత్ గురించి అందరికీ తెలిసినదే. హీరోయిన్ కీర్తి రెడ్డిని 2004లో వివాహం చేసుకొని, మనస్పర్ధలు కారణంగా 2006లో విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక ప్రకాష్ రాజ్ తమిళ నటి లలిత కుమారిని 1994లో వివాహం చేసుకొని, ఆ తర్వాత 2010లో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సోనీ వర్మను పెళ్లి చేసుకుని సెటిలైపోయాడు.