ఆ మాటలు విని బాహుబలి ఆపేయాలి అనుకున్న రాజమౌళి..వామ్మో సినిమా వెనుక ఇంత నడిచిందా..?

తెలుగు సినిమా అంటేనే బాహుబలి కి ముందు బాహుబలి తర్వాత అనే విధంగా దర్శకధీరుడురాజమౌళి ఆ సినిమాలను రూపొందించాడు. ఆ సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అయి ప్రపంచవ్యాప్తంగా మంచి క్రిజ్‌ను తెచ్చుకున్నాయి. బాహుబలి సినిమాలతో తెలుగు సినిమాల స్థాయి ప్రపంచ స్థాయి మీడియాలలో కూడా తెలుగు సినిమాలు గురించి చెప్పే విధంగా మారింది.
తాజాగా ఈ సినిమాల నిర్మాతలో ఒకరైన శోభు యార్లగడ్డ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడతు… కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అయ‌న చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Baahubali steered its way through many problems: Producer Shobu |  Entertainment News,The Indian Express

ఆయన మాట్లాడుతూ.. ‘కొన్ని సినిమాలో థియేటర్లలో చూడటానికి బాగుంటాయి.. మరి కొన్ని సినిమాలు ఓటీటీలో చూడటానికే ఇష్టపడతం. ఇప్పుడున్నఈ జనరేషన్‌లో థియేటర్లు కన్నా ఓటిటిలో సినిమాలు రిలీజ్ చేయటం అనేది రోజురోజుకీ భారీగా పెరిగిపోతుంది. థియేటర్‌లు లేని ప్రాంతాల్లో కూడా ఓటీటీలో సినిమాలు వెళ్తున్నాయి అని శోభుయార్లగడ్డ చెప్పారు’. సినిమా స్టోరీ బట్టి ఆ సినిమా థియేటర్‌లో సూట్ అవుతుందా లేదా ఓటీటీకి అనేది సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు అని అన్నారు. ‘ఏ నిర్మాతకైనా కొన్ని సొంత లెక్కలు ఉంటాయి.. బాహుబలి సినిమా కూడా మేము అనుకున్న అంచనా ఒకటి సినిమా అయిన బడ్జెట్ ఒకటి. ఆ సమయంలో రాజమౌళి మీకు ఇబ్బందిగా ఉంటే ఈ సినిమా ఆపేసి వేరే సినిమా చేద్దామని కూడా అన్నారని శోభు యార్లగడ్డ చెప్పారు’.

Baahubali audio launch postponed

‘మేము ఎంతో కష్టపడి ఈ సినిమాని రూపొందించామని శోభు యార్లగడ్డ అన్నారు. బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో నెగటివ్ కామెంట్లు వచ్చాయి. ఆ టైంలో మేము ఎంతో ఆవేదనకు గురయ్యాము. ఒకనోక టైంలో సినిమాని మానేద్దామా అన్న ఆలోచన కూడా మాకు వచ్చింది. కానీ సినిమా విడద‌లై సూపర్ హిట్ అయి అందరి దగ్గర నుంచి గొప్ప ప్రశంసలు వచ్చాయి. అప్పుడే మాకు అర్థమైంది ప్రేక్షకుడు మంచి కథతో వస్తే ఎలాంటి సినిమా అయినా ఆదరిస్తారని ఈ సినిమాతో మళ్లీ రుజువు అయిందని శోభు యార్లగడ్డ చెప్పుకొచ్చారు’.

Share post:

Latest