బాలకృష్ణకి వరుస షాకులు.. ఆ సినిమా నుంచి తప్పుకున్న ఆ యాక్టర్..?

ఇటీవల కాలంలో బాలకృష్ణ సినిమాల ఆఫర్లను హీరోయిన్లు మరో ఆలోచన లేకుండా రిజెక్ట్ చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, శృతిహాసన్, కేథ‌రిన్ థ్రెసా వంటి చాలా మంది హీరోయిన్లు బాలకృష్ణ సినిమాలు తిరస్కరించారు. కారణాలు ఏవైనా సరే కీలక పాత్రల్లో నటీనటులను ఫైనలైజ్ చేయడంలో బాలకృష్ణ దర్శకులు నానా తిప్పలు పడుతున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడికి కూడా అదే పరిస్థితి ఎదురవుతోందట. అయితే లోకల్ యాక్టర్స్‌ను కాదని కోలీవుడ్, మాలీవుడ్ యాక్టర్స్‌ను ఎంపిక చేయడానికి డైరెక్టర్స్ ప్రయత్నించడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ వేరే భాష నటీనటులు టాలీవుడ్ ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్నారు. లేదంటే భారీ ఎత్తున రెమ్యునరేషన్ అడుగుతున్నారు.

అనిల్ రావిపూడి, బాలయ్య సినిమాలో చేయడానికి లేడీ సూపర్ స్టార్ నయనతార ఏకంగా ఎనిమిది కోట్లు అడిగిందట. దాంతో షాక్‌ కావడం అనిల్ వంతయ్యింది. ఇప్పుడు తమిళ హీరో అరవింద్‌ స్వామి కూడా సేమ్‌ అదే పాట పాడుతున్నాడు. అన్ని సంప్రదింపులు అయిపోయాక అరవింద్‌ స్వామి ఊహించని రీతిలో భారీగా పారితోషకం అడిగాడట. దాంతో అనిల్ ఒక్కసారిగా షాక్ తిన్నాడట. ఆ వెంటనే వెనక్కి తగ్గాడని టాక్. అలానే ఇప్పుడు ఎవరిని ఎంపిక చేసుకోవాలో తెలియక అనిల్ చాలా సందిగ్ధంలో పడిపోయాడు.

నిజానికి గతంలో తమిళ, మలయాళ యాక్టర్స్ తెలుగులో నటించేందుకు చాలా తక్కువగానే ఛార్జ్ చేసేవారు. కానీ ఇప్పుడు వారికి డిమాండ్ పెరగడంతో పారితోషకం కూడా పెంచేస్తున్నారు. ముఖ్యంగా హై బడ్జెట్ మూవీలకు, పాన్ ఇండియా సినిమాలకు నాలుగైదు రెట్లు అధికంగా శాలరీ అడుగుతున్నారు. అయితే బాలకృష్ణ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కావడం లేదు. దాంతో ఎవర్నో ఒకర్ని ఎంపిక చేసుకొని సినిమాని పూర్తిచేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Share post:

Latest