ఇంత స‌స్పెన్స్ ఎందుకు తార‌క్‌… బాగా డిజ‌ప్పాయింట్మెంట్ అవుతున్నారుగా…!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తన లాస్ట్ సినిమా `త్రిబుల్ ఆర్` సినిమా తర్వాత ఇటు సౌత్ లోనూ అటు నార్త్ లోను ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్, ఫేమ్ అందుకున్నాడు. అయితే అభిమానులు మాత్రం తారక్ నెక్స్ట్ మూవీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధా ఆర్ట్స్ పతాకం పై కొరటాల శివ సన్నిహితుడు సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాని నిర్మించబోతున్నారు. తారక్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్ టీజర్ కి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కావలసి ఉన్న ఈ సినిమాపై మాత్రం ఇప్పటికీ అదే సస్పెన్స్ కొనసాగుతుంది.

మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యి ఇన్ని రోజులైనా ఇంకా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.. అనేది కన్ఫర్మ్ కాలేదు. దీంతో తార‌క్ అభిమానులు కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? అన్న విషయంపై క్లారిటీ లేకపోవడంతో అభిమానులు చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. త్రిబుల్ ఆర్ రిలీజ్ అయ్యాక ఆరు నెల‌లుగా తార‌క్ ఖాళీగానే ఉన్నాడు.