పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్ సోదరుడు.. బిజెపి ప్లాన్ ఫలిస్తుందా..?

రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించిన తర్వాత ఎన్నో కీలక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కృష్ణంరాజు మరణించిన తర్వాత ఆయన మరణానికి తీవ్ర ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూనే ప్రభాస్ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ ను రాజకీయ ఎంట్రీ చేయడానికి రాజ్ నాథ్ సింగ్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బిజెపి పార్టీలో అడుగుపెట్టి తన రాజకీయ ఎంట్రీని మొదలుపెట్టిన కృష్ణంరాజు నరసాపురం నియోజకవర్గం నుంచి లోకసభ కు పోటీ చేసి ఎంపిక అయ్యారు. అంతే కాదు కేంద్ర మంత్రిగా కూడా కృష్ణంరాజు వ్యవహరించిన విషయం తెలిసిందే.

Prabhas' Brother Prabodh Convicted In A Cheque Bounce Case - Filmibeat
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి ఒకరు రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిజానికి రెండు గోదావరి జిల్లాలలో ప్రభాస్ ఫ్యామిలీకి మంచి పట్టు ఉంది. ఇక బాహుబలి సినిమాతో హీరో ప్రభాస్ క్రేజీ హీరోగా మారిపోయారు. ఇక ఆల్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ కి మంచి గుర్తింపు ఉంది. ఇక దీన్ని తమకు అనుకూలంగా చేసుకోవాలని బిజెపి ప్లాన్ వేస్తోంది ..రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకొని అసెంబ్లీ ఎన్నికల్లోను పార్లమెంటు ఎన్నికల్లోను.. ప్రభాస్ క్రేజ్ ను ఉపయోగించుకోవచ్చనే ఉద్దేశంతో బిజెపి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

PALEM HARIBABU on Twitter: "Brothers goal #prabhas nd #prabodh Real  brothers https://t.co/Y2lhOx8hN7" / Twitter

ఇక కృష్ణంరాజు ఫ్యామిలీ బిజెపిలోకి ఎంట్రీ ఇస్తే గోదావరి జిల్లాలో తమకు ప్లస్ అవుతుందనే అంచనా కూడా వేస్తున్నారు. ఇక బిజెపి ఆహ్వానంపై ప్రభాస్ ఫ్యామిలీ కూడా సానుకూల సంకేతం ఇచ్చిందని సమాచారం. ఇక ప్రభాస్ సొంత సోదరుడు ప్రభోధ్ ను నరసాపురం నుంచి ఎంపీగా బరిలోకి దించాలని బిజెపి భావిస్తోంది. ఇక ఈ ఆఫర్ కి ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని సమాచారం. ప్రబోధ్ కూడా నరసాపురం నుంచి పోటీ చేసి విజయం సాధిస్తాడో లేదో తెలియాల్సి ఉంది. దీన్ని బట్టి బిజెపి ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా ఎన్నికలు జరిగే వరకు ఎదురు చూడక తప్పదు.

Share post:

Latest