నో డౌట్…ఆ సీనియర్ ఎమ్మెల్యే అవుట్?

నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావాలని జగన్ గట్టిగానే కష్టపడుతున్నారు…అసలే కసి మీద ఉన్న టీడీపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు..అందుకే నెక్స్ట్ కూడా అధికారంలోకి రావడం జగన్‌కు అవసరమే. ఆ దిశగానే జగన్ పనిచేస్తున్నారు కూడా. ఇక నెక్స్ట్ గెలవడానికి పార్టీలో ఊహించని మార్పులు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. అసంతృప్తి వ్యక్తం చేసినా…తిరుగుబాటు చేసినా కొందరు ఎమ్మెల్యేలకు మాత్రం సీటు ఇవ్వకూడదని జగన్ ఫిక్స్ అయిపోయారని తెలుస్తోంది.

మళ్ళీ వారికి సీటు ఇస్తే పార్టీ ఓడిపోవడం ఖాయమని జగన్‌కు రిపోర్టులు వచ్చాయి. ఈ క్రమంలో కొందరు ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వడం కష్టమని ముందే జగన్..హింట్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవికి నెక్స్ట్ సీటు లేదని తేల్చేశారు. ఇదే క్రమంలో దర్శి సీటు విషయంలో కూడా దాదాపు క్లారిటీ ఇచ్చినట్లే కనిపిస్తున్నారు. ఈ క్రమంలో బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడుకు నెక్స్ట్ సీటు లేదని తెలుస్తోంది.

టీడీపీ ఆవిర్భావం నుంచి శంబంగి ఏపీ రాజకీయాల్లో ఉన్నారు…1983, 1985 ఎన్నికల్లో టీడీపీ నుంచే బొబ్బిలి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 1989 ఓడిపోయిన ఆయన…1994లో గెలిచారు…ఇంకా అంతే వరుసపెట్టి 1999, 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో 2009లో సీటు రాలేదు…తర్వాత వైసీపీలో చేరి, కొంతకాలం రాజకీయాలకు దూరం జరిగారు.

అయితే బొబ్బిలిలో పట్టు ఉన్న సుజయ కృష్ణ రంగరావు 2014లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్ళి మంత్రి అయ్యారు…ఇక 2019లో ఈయన టీడీపీ నుంచి పోటీ చేయగా, మళ్ళీ వైసీపీలోకి వచ్చి శంబంగి పోటీ చేశారు. విజయం శంబంగిని వరించింది. ఎమ్మెల్యేగా శంబంగి..బొబ్బిలికి చేసేంది పెద్దగా ఏమి కనిపించడం లేదు. తక్కువ కాలంలోనే ఈయనపై వ్యతిరేకత వచ్చింది..అటు టీడీపీ నుంచి సుజయ తమ్ముడు బేబీ నాయన దూకుడుగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ టీడీపీ గెలుపు ఖాయమనే పరిస్తితి వచ్చింది. అందుకే నెక్స్ట్ బొబ్బిలి సీటు శంబంగికి దక్కడం కష్టమని తేలింది…ఈయన స్థానంలో వైసీపీ నుంచి బలమైన నేత దిగవచ్చు అని ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ఈ సీనియర్‌ని జగన్ సైడ్ చేస్తారో లేదో.