నిమ్మల బలం పెంచుతున్న ‘ఫ్యాన్స్’..!

వైసీపీ అధికారంలో ఉండటం వల్ల…ఆ పార్టీకి చెందిన నేతలు గాని, ఎమ్మెల్యేలు గాని అధికార బలం వల్ల స్ట్రాంగ్ గా కనిపించవచ్చు..కానీ అధికారంలో లేకపోయినా సరే బలమైన నాయకులు టీడీపీలో కూడా ఉన్నారు. అలా టీడీపీలో ఉన్న బలమైన నేతల్లో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. పార్టీ బలంతో పాటు సొంత ఇమేజ్ ఎక్కువ ఉన్న నిమ్మల…గత రెండు ఎన్నికల్లో వరుసగా పాలకొల్లులో గెలుస్తూ వస్తున్నారు.

గత ఎన్నికల్లో జగన్ గాలిని సైతం తట్టుకుని మంచి మెజారిటీతో నిమ్మల గెలిచారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ చేసి..ఆయా స్థానాల్లో టీడీపీ బలం తగ్గించడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తూ వస్తుంది. కానీ ఎంత చేసిన పాలకొల్లులో నిమ్మల బలం మాత్రం తగ్గించలేకపోతున్నారు.  నిత్యం ప్రజల్లో ఉంటూ…ప్రజల సమస్యల పరిషకరం కోసం పోరాటం చేసే నిమ్మలకు ప్రజా మద్ధతు ఎక్కువగానే ఉంది.

అయితే ప్రజల మద్ధతు వైసీపీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది…అంటే వైసీపీ ప్రజల కోసం పనిచేయాలి…కానీ అలా చేయకుండా కేవలం నిమ్మల టార్గెట్ గానే రాజకీయం చేయడం వల్ల…ఇంకా నిమ్మల బలం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. తాజాగా టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం నిమ్మలకు…సభావేదికపై నిమ్మలకు చోటు ఇవ్వాలి. కానీ ఆయనని సభ పైకి రానివ్వకుండా వైసీపీ నేతలు పదే పదే…ఆయన్ని స్టేజ్ మీద నుంచి తోసేసే కార్యక్రమం చేశారు.

అసలు టిడ్కో ఇళ్ళు టీడీపీ హయాంలో నిర్మాణం జరిగాయనే సంగతి తెలిసిందే. పాలకొల్లులో వందల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం జరిగేలా రామానాయుడు చూసుకున్నారు. అయితే ఇళ్లని లబ్దిదారులకు ఇచ్చే సమయానికి ప్రభుత్వం మారిపోయింది..దీంతో చివరి దశలో పనులని పూర్తి చేసి…టిడ్కో ఇళ్లకు బ్లూ రంగులు వేసి.. ఆ ఇళ్లని తామే కట్టించినట్లుగా వైసీపీ ..లబ్దిదారులకు పంపిణీ చేసే కార్యక్రమం మొదలుపెట్టింది. అయితే పాలకొల్లులో ఇళ్లని పంపిణీ చేసేటప్పుడు…స్థానిక ఎమ్మెల్యేగా నిమ్మలకు ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇవ్వాలి..అలా ఇవ్వకుండా స్టేజ్ పై నుంచి తోసేశారు. ఇలాంటివి చేయడం వల్ల నిమ్మలకు ఇంకా ప్లస్ అవ్వడం, వైసీపీకి ఇంకా మైనస్ అవ్వడం జరుగుతుంది.