ఇంతకీ బొద్దుగుమ్మ ‘నిత్యా మీనన్’ను ఇబ్బంది పెడుతున్నది ఎవరు?

బేసిగ్గా మలయాళ బొద్దుగుమ్మ నిత్యా మీనన్ అంటే తెలుగునాట తెలియని ప్రజలు ఉండరనే చెప్పుకోవాలి. తెలుగులో ‘అలా మొదలైంది’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నిత్యా అటుపై వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. సహజమైన నటనే ఆమెకి ప్లస్ అయింది. ముఖ్యంగా స్కిన్ షోకు దూరంగా ఉంటూ పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చింది. అందుకనే ఇక్కడ ఆమెకి ప్రత్యేకమైన అభిమానులు వుంటారు. ఆమెలో వున్న ఇంకో ప్రత్యేకమైన లక్షణం ముక్కుసూటిదనం. అవును… పాత్ర తాలూకా తీరుతెన్నులు నచ్చకపోతే వెంటనే ఆ సినిమాని తిరస్కరిస్తుంది.

అంత టాలెంట్ వున్న నిత్యామీనన్ కెరీర్ ఆరంభం నుండి కూడా ఏదో ఒక వివాదం వెంటాడుతూనే వుంది. టాలీవుడ్ తో పాటు మిగతా భాషల్లో కూడా ఆమె ఏదో ఒక వివాదంలో ఇరుక్కుపోయి ఉంటుంది. నటిగా ప్రతిభావంతురాలు అయిన నిత్యా మీనన్ కాస్త పొగరుగా మాట్లాడుతుంది అనేది చాలా కాలంగా కొందరి అభిప్రాయం. ఆ పొగరు వల్లే ఇండస్ట్రీ లో ఆమె స్టార్ గా నిలవలేకపోయింది అనేది కొందరి అభిప్రాయం. ఈ క్రమంలో ఆమెకు మాత్రమే సాధ్యమైన పాత్రలు రెగ్యులర్ గా ఆమె వద్దకు వెళ్తూనే ఉన్నాయి.

ఇకపోతే, కెరీర్ ఆరంభం నుండి నిత్యా బిజీగానే ఉంటోంది. తాజాగా ధనుష్ తో కలిసి నటించిన తిరు చిట్రంఫలం అనే సినిమా విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా తన పై ఈ మధ్య కాలంలో వస్తున్న వివాదాస్పద అంశాలపై స్పందించింది. తనకు ఇండస్ట్రీలో చాలా మంది శత్రువులు ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసి, పెనుదుమారాన్నే సృష్టించింది. మన ఎదుగుదల గిట్టని వారు.. వాళ్ల మాట వినకుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాతో పని చేయడం చాలా కష్టం అంటూ ప్రచారం చేయడంతో పాటు నన్ను కిందకు లాగేందుకు ప్రయత్నిస్తున్న వారు చాలా మందే ఉన్నారంటూ నిత్యా మీనన్ పేర్కొంది. కాగా ఈ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Share post:

Latest