డైరెక్టర్ గా మారనున్న ఆ మెగా హీరో..ఈ ట్వీస్ట్ మామూలుగా లేదుగా..!!

హీరోలకు పెట్టింది పేరు మెగా ఫ్యామిలీ. మెగాస్టార్ చిరంజీవి తర్వాత తన నట వారసత్వాన్ని ఉనికి పుచ్చుకొని సినిమాల్లోకి వచ్చిన వారిలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ అందరూ హీరోలుగా ఎంట్రీ ఇచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలు కొనసాగుతున్నారు. ఇక ఇటీవల ఆ కుటుంబం నుంచి ఉప్పెన సినిమాతో మెగాహీరో వైష్ణవ తేజ్ సినిమాలకి పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే అదిరిపో హిట్టు కొట్టిన వైష్ణవ్ తేజ్. రెండో సినిమాతో కొంచెం నిరాశపరిచాడు.

Here We Introduce Aasi And Sangeeta From 'Uppena'

తాజాగా వైష్ణవ్ తేజ్‌ తన మూడో సినిమా రంగ రంగా వైభవంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను నూతన దర్శకుడు గిరీశయా తెరకెక్కించాడు. ఇందులో వరుణ్ తేజ్ కి జోడిగా కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 2న‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలతేది దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్ చేస్తుంది. తాజాగా వైష్ణవ్ తేజ్ సినిమా యూనిట్ నిర్వహించిన ప్రమోషన్లలో పాల్గొని వైష్ణవ ఆసక్తికర కామెంట్లు చేశాడు. తన ఫ్యామిలీ లైఫ్ గురించి తన కెరీర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Here We Introduce Vaishnav Tej And Ketika Sharma From 'Ranga Ranga  Vaibhavanga'

“నాకు సినిమాలో నటించిడం కంటే డైరెక్షన్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. నేను కొన్ని రోజులే సినిమాల్లో నటిస్తాను అని.. ఆ తర్వాత డైరెక్టర్ గా మారుతానని చెప్పాడు. ఇక దీంతోపాటు వైష్ణవ్ తేజ్ ఒక మల్టీస్టారర్ కథను కూడా రాశారట. ఇందులో హీరోలుగా సాయిధరమ్ తేజ్- వరుణ్ తేజ్ ను పెట్టి సినిమా తీస్తానని” మీడియాకి చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ ఎవరూ దర్శకత్వం వైపు వెళ్లలేదు. కేవలం పవన్ కళ్యాణ్ తప్ప మరి ఏ హీరో ఆ ఫ్యామిలీలో డైరెక్ట్ర్ ఛాన్స్ పట్టలేదు. ఇప్పుడు వైష్ణవ్ డైరెక్టర్ అవుతానని తెలిపారు. దీంతో వైష్ణవ్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

There's no competition between Varun Tej and Sai Dharam Tej

Share post:

Latest